సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కల్లం | Ajeya Kallam took charge as chief advisor to Chief Minister | Sakshi
Sakshi News home page

సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కల్లం

Published Thu, Jun 6 2019 3:45 AM | Last Updated on Thu, Jun 6 2019 3:45 AM

Ajeya Kallam took charge as chief advisor to Chief Minister - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సచివాలయం తొలి బ్లాక్‌ మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్‌ హోదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధిపతిగా వ్యవహరిస్తారు.

బాధ్యతలు స్వీకరించడానికి ముందు అజేయ కల్లం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన (రాజకీయ వ్యవహారాలు) ముఖ్యకార్యదర్శి రామ్‌ ప్రకాశ్‌ సిసోడియా, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్‌.శ్రీకాంత్, ఇతర అధికారులు అజేయ కల్లంను కలిసి అభినందనలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement