రాష్ట్రంలో లక్ష మంది ఎస్సీ అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు జూపూడి తెలిపారు.
ఏలూరు: రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి, సంక్షేమం, ఐక్యత ప్రధాన అంశాలుగా వారి ఆర్థికాభివృద్ధికోసం భూమి కొనుగోలు పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేయాలని నిర్ణయించామని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు.
స్థానిక జెడ్పీ అతిథిగృహంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కోసం అమలుచేస్తున్న భూమి కొనుగోలు పథకాన్ని ఇచ్చే రుణాన్ని రూ.5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచామని, తొలి విడతగా 1200 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో లక్ష మంది ఎస్సీ అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కార్యక్రమాలు రూపొందించామన్నారు.