సాక్షి, అమరావతి : రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్, పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. అనంతరం ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మేనిఫెస్టోను పాలనకు గీటురాయిగా చేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు. వాహన మిత్రతో ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలుపుకున్నారు. ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని పార్టీలో చేరా. మద్య నిషేధంపై గతంలో చాలా మంది హామీ ఇచ్చారు. సీఎం జగన్ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నార’’ని అన్నారు.
పొరపాట్లు నా వైపు ఉన్నాయి : జూపూడి
మంచి పరిపాలన రావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. ఐదుగురు దళితులకు కేబినేట్‌లో సీఎం జగన్ స్థానం కల్పించారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారని అన్నారు. సీఎం జగన్ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment