akula sathyanarayana
-
వైఎస్సార్ సీపీలోకి జూపూడి, ఆకుల
-
వైఎస్సార్ సీపీలోకి ఆకుల, జూపూడి
సాక్షి, అమరావతి : రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్, పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. అనంతరం ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మేనిఫెస్టోను పాలనకు గీటురాయిగా చేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు. వాహన మిత్రతో ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలుపుకున్నారు. ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని పార్టీలో చేరా. మద్య నిషేధంపై గతంలో చాలా మంది హామీ ఇచ్చారు. సీఎం జగన్ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నార’’ని అన్నారు. పొరపాట్లు నా వైపు ఉన్నాయి : జూపూడి మంచి పరిపాలన రావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. ఐదుగురు దళితులకు కేబినేట్లో సీఎం జగన్ స్థానం కల్పించారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారని అన్నారు. సీఎం జగన్ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు. -
జనసేనకు షాకిచ్చిన ఆకుల
సాక్షి, విజయవాడ : జనసేన పార్టీకి సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ షాకిచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పవన్‌కు పంపించారు. కాగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సత్యనారాయణ కూడా పార్టీని వీడటం.. మరికొంత మంది నేతలు కూడా ఇదే బాటలో నడుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి. కాగా గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి సత్యనారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు... కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఇలా నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నా జనసేన అగ్రనేతలు స్పందించకపోవడం గమనార్హం. -
ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది : బీజేపీ
ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం విజయవాడ: ‘ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో విజయవాడలోని దేవాలయాలు, మసీదులు కూల్చి టాయిలెట్లు కడుతున్నారు’ అంటూ బీజేపీ ఏపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజయవాడలో కూల్చివేసిన దేవాలయాలతో పాటు గోశాల ప్రాంతాన్ని గురువారం వారు సందర్శించారు. అనంతరం దేవాలయాలను పునఃనిర్మించాలని కోరుతూ హిందూ ధర్మ పరిషత్ నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కూల్చిన దేవాలయాలను వెంటనే పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాలు, మసీదులు, గోశాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూల్చివేసిన చోటే వాటిని తిరిగి నిర్మిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్లే ఘాట్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు వస్తున్నాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాల న్నారు. -
'ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోందా'