ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది : బీజేపీ | mla vishnu kumar raju, akula satyanarayana fires on temples demolition | Sakshi
Sakshi News home page

ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది : బీజేపీ

Published Fri, Aug 5 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది : బీజేపీ

ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది : బీజేపీ

ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
విజయవాడ: ‘ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో విజయవాడలోని దేవాలయాలు, మసీదులు కూల్చి టాయిలెట్లు కడుతున్నారు’ అంటూ బీజేపీ ఏపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజయవాడలో కూల్చివేసిన దేవాలయాలతో పాటు గోశాల ప్రాంతాన్ని గురువారం వారు సందర్శించారు.

అనంతరం దేవాలయాలను పునఃనిర్మించాలని కోరుతూ హిందూ ధర్మ పరిషత్ నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కూల్చిన దేవాలయాలను వెంటనే పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాలు, మసీదులు, గోశాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  కూల్చివేసిన చోటే వాటిని తిరిగి నిర్మిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్లే ఘాట్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు వస్తున్నాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాల న్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement