'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతోందా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. పాకిస్తాన్లో ఉన్నామా?' అంటూ దేవాలయాల కూల్చివేత ఘటనపై భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. విజయవాడలో దేవాలయాలు, మసీదులు, గోశాలను ప్రభుత్వం తొలగించిన ప్రాంతాన్ని గురువారం బీజేపీ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు పరిశీలించారు