సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే వాడే.. కానీ తీసుకునేవాడు కాదని స్పస్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పేదల భూములు లాక్కుంటే తానే విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.
తన మాటలను నమ్మాలని, కూటమి విష ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోవద్దని కోరారు. మీ భూమి మీది కాదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని అన్నారు. రైతులకు వంశపారంపర్యంగా వచ్చే బూములు వారికి కాకుండాపోతాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేయడానికి లేనిపోని పెంట రాసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సడెన్‌గా రామోజీ భార్య ఆయన భార్య కాకుండాపోతుందా అనిసెటైర్లు వేశారు.
‘సీఎం జగన్‌ను తిట్టాలి అని చంద్రబాబు పిలుపు ఇవ్వగానే హైదరాబాద్ నుంి,ఇ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఒక పచ్చ మంద దిగుతుంది. ఒక్క రోజు కుిడా ఏపీలో లేనివారు ఇవాళ ఏపీ గురించి మాట్లాడతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్న పచ్చమంద ఎవరైనా వచ్చి సాయం చేశారా? అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కోవిడ్ కాలంలో బాబు హైదరాబాద్ మదీనాగూడలోని వందల ఎకరాల ఫాంమౌజ్‌లో ఉన్నాడు. కరోనా సమయంలో కనీసం పవన్ కల్యాణ్ వస్తాడేమో అని ఎదురు చూశారు. మరి కరోనా సమయంలో కాపులకు అయినా సహాయం చేశాడా పవన్?.
కానీ సీఎం జగన్ ఒక్కడే రాష్ట్రంలో నిలబడి కరోనా లో ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాడు. నేను చెప్పాను అని కాదు జగన్‌ను మీరు కోల్పోతే మీకు ఒక్క పథకం దక్కదు. చంద్రబాబు అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్క పైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఓటు వేసే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ప్రాణం ఉన్నంత వరకు పేదల ప్రాణాలకు అండగా నిలిచే జగన్‌కు మీరు మద్దతుగా ఉండండి’ అని పోసాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment