
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం తనని చంపేస్తుందేమోనని రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి భయపడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.గురువారం గుంటూరు జైల్లో ఉన్న పోసానితో అంబటి రాంబాబు ములాకత్ అయ్యారు.
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.పోసానిపై ప్రభుత్వం 17 కేసులు బనాయించింది. అన్ని కేసుల్లో బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో సిఐడి వారు పిటి వారెంట్ దాఖలు చేసి పోసాని ని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు.
ఆయనపై సీఐడీ 111 సెక్షన్ నమోదు చేశారు. 111 సెక్షన్ పోసానికేసుకు వర్తించదు అని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
మేజిస్ట్రేట్ సైతం 111 సెక్షన్‌ను తిరస్కరించారు. ఎప్పుడో మీడియాలో మాట్లాడితే ఇప్పుడు పోసానిపై కేసులు పెట్టడం దారుణం.
జైల్లో పోసాని కృష్ణ మురళి భయపడుతున్నారు.ప్రభుత్వం నన్ను చంపేస్తుందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారులని ఏమైనా చేస్తారేమో అని పోసాని కంగారు పడుతున్నారని’ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments
Please login to add a commentAdd a comment