
పోసాని అరెస్ట్ అప్‌డేట్స్..
👉ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. గతంలో కుట్రపూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి.
ఓబులవారిపల్లి పీఎస్‌కు పోసాని..
ఎట్టకేలకు పోసానిని ఓబులవారిపల్లి పీఎస్‌కు పోసాని పోలీసులు తీసుకువచ్చారు.
ఈ సందర్బంగా ఓబులవారిపల్లి పీఎస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
పీఎస్‌లోనే పోసానికి వైద్య పరీక్షలు చేసే అవకాశం.
👉పోసాని అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడారు. అరెస్ట్ నోటీసుల్లో 27వ తేదీ(ఈరోజు తేదీ) వేశారు పోలీసులు. పోసాని కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్ట్ సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కానీ, పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్‌లో ఓబులాపల్లి పీఎస్ అంటూ చెప్పుకొచ్చారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోసాని ఎక్కడ?
- పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.
- బుధవారం రాత్రి 8:25 గంటలకు పోసాని అరెస్ట్.
- 13 గంటలుగా పోలీసుల అదుపులోనే పోసాని.
- ఇప్పటికీ పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై కచ్చితమైన సమాచారం ఇవ్వని పోలీసులు.
- పోసానిని రాజంపేట పీఎస్‌కు తరలిస్తారని సమాచారం.
- పోసాని ఆరోగ్య పరిస్థితిపై భార్య, కుమారుడు ఆందోళన.
- ఆయన తరఫు న్యాయవాదులకు సమాచారం ఇవ్వని పోలీసులు.
- వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లోని ఏ పీఎస్‌కు తీసుకెళ్తారనే దానిపై రాని స్పష్టత.
పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్‌తో బట్టబయలైన పోలీసుల కుట్ర
బుధవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ.. అతని కుటుంబ సభ్యులకి ఇచ్చిన నోటీసుల్లో మాత్రం గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు
ఇది నిబంధనల్ని ఉల్లఘించడం కాదా చంద్రబాబూ? ఇలాంటి పోలీసుల్ని ఏం చేయాలి?… pic.twitter.com/iFcfOCBNU7— YSR Congress Party (@YSRCParty) February 27, 2025
👉అన్నమయ్య జిల్లా..
పోసానితో ఫోన్‌లో మాట్లాడిన హైకోర్టు న్యాయవాది బాల
న్యాయవాది బాల కామెంట్స్..
సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించకుండా రాత్రి అరెస్టు చేయడం చట్ట విరుద్ధం
నోటీసులు ముందుగా ఇవ్వకుండా, వయసు రీత్యా ఇబ్బందులు పోలీసులు ఇబ్బందులు పెట్టారు
బెయిల్ పిటిషన్, రిజెక్షన్ ఆఫ్ అరెస్టు పిటిషన్‌ను రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేస్తున్నాం
కాసేపట్లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది.
అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ జిల్లా..
- పోసాని అరెస్టును ఖండించిన తిరువూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామి దాస్
- స్వామి దాస్ కామెంట్స్..
- రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేయటం కక్షపూరిత చర్యలే
- అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రి వేళ తరలించడం అన్యాయం
- కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో అదే గతి వారికీ పడుతుంది
- ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అన్యాయం
- బేషరతుగా పోసానిని విడుదల చేయాలి
కృష్ణాజిల్లా..
- పోసాని అక్రమ అరెస్ట్‌ను ఖండించిన మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టు
- పేర్ని కిట్టు కామెంట్స్..
- ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోంది
- ఇలాంటి ఘటనలు ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదు
- సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారు
- మరి మీరు పెట్టిన పోస్టుల సంగతేంటి?.
- ఇప్పుడు జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారు
- రూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటాం
కర్నూలు జిల్లా..
- ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..
- రాష్ట్రంలో అరాచక పాలన తప్ప ప్రజాపరిపాలన లేదు
- రోజుకు ఒకరిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారు
- పోసానిని అరెస్ట్ చెయ్యడం అక్రమం
- ఏ కేసులో ఆయనను అరెస్ట్ చేస్తూన్నారో కుటుంబ సభ్యులకు తెలియ చెయ్యాలి కాని ఏమాత్రం చెప్పడం లేదు.
- చంద్రబాబు.. రానున్న కాలంలో మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిక.
విశాఖ..
- పోసాని అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫైర్..
- పవన్, లోకేష్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయి..
- ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టులేక అక్రమ కేసులు పెడుతున్నారు..
- పోసాని అరెస్ట్ పవన్ కళ్యాణ్ ఆలోచనే..
- ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.
- ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన గుణపాఠం చెప్తారు..
- భవిష్యత్ లో ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి..
- ప్రభుత్వం కేసులు పెడితే.. ఎదురించి నిలబడతాం..
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు?

ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసానిపై కేసు నమోదు..
- ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు
- జనసేన నాయకుడు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు
- జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు నేపథ్యంలో అరెస్టు
- చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జోగినేని మణి
- పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
- హైదరాబాద్‌లోని తన స్వగృహంలో నిన్న రాత్రి పోసాని అరెస్టు
- రాజంపేట కోర్టులో ప్రవేశపెడతామని తెలిపిన పోలీసులు
- వ్యవస్థీకృత నేరమంటూ ఆఘమేఘాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు
- 24వ తేదీన ఫిర్యాదు చేస్తే పూర్తి విచారణ జరగకుండానే నిన్న రాత్రి అరెస్టు
- తన ఆరోగ్యం బాగా లేదని, చికిత్స అనంతరం వస్తానని పోసాని కోరినా వినని పోలీసులు

111, ఇతర సెక్షన్ల కింద కేసులు..
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.
శివరాత్రి పూట రెడ్ బుక్ రాజ్యాంగంలో రెచ్చిపోతున్న @ncbn ప్రభుత్వం. రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా అక్రమ అరెస్టులు
పోసాని కృష్ణమురళిని హైదారాబాద్ లోని ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పటికే రాజయికీయాలకి దూరంగా ఉన్న పోసాని.. ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి… pic.twitter.com/ZnjBhYmwvJ— YSR Congress Party (@YSRCParty) February 26, 2025
Comments
Please login to add a commentAdd a comment