కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్న కేఎం హాస్పిటల్‌కు మార్చి 20వ తేదీ నుంచి వెళ్లిన వారికి కరోనా సోకే ప్రమాదం ఉందని, అలాంటి వారు వెంటనే 8333988955 నంబర్‌కు ఎంఎస్‌ఎం మెసేజ్, వాట్సాప్ యాప్ ద్వారా వివరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేఎం హాస్పిటల్‌లో ఒకరికి కరోనా వైరస్ సోకిందని, ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. వివరాలు తెలిపిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తుందని , వ్యాధి లక్షణాలు ఉన్నదీ, లేనిదీ తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అప్పటి వరకు ఇంటిలోనే విడివిడిగా ఉండాలని, ఇతరులు తాకిన ప్రదేశాలను, వస్తువులను తాకకూడదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment