
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): జాతీయ కవి కువెంపు కోడలు, కవి కే.పీ.పూర్ణచంద్ర తేజస్వి సతీమణి రాజేశ్వరి (84) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. చికిత్స ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు దేహాన్ని ఓ ఆస్పత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చదవండి: డిజిటల్ కరెన్సీకి తుది మెరుగులు!.. సెబీకి అప్పగిస్తే ఏం చేద్దాం?
Comments
Please login to add a commentAdd a comment