భోపాల్ : బకాయిలు చెల్లించనందుకు తన తండ్రిని మంచానికి కట్టిపడేసారని మహిళ ఆరోపించిన మూడు రోజుల తరువాత, జిల్లా యంత్రాంగం సదరు ఆసుపత్రిని సీజ్ చేసింది. వివరాల ప్రకారం..రాజ్‌గర్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ కడుపునొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. మొదట 10,800 రూపాయలు జమ చేయగా, శుక్రవారం ఆస్పత్రి యాజమాన్యం మరో పదివేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అంత మొత్తాన్ని ఇవ్వడానికి కుటుంబసభ్యులు నిరాకరించారు. (డయాబెటీస్‌కు కరోనా యమ డేంజర్! )
డిశ్చార్జ్ చెయ్యమని అడగ్గా చికిత్స పొందుతున్న తండ్రిని నిర్ధాక్షిణ్యంగా మంచానికి కట్టివేశారని బాధితుడి కుమార్తె ఆరోపించింది. ఆసుపత్రి యాజమాన్యం ఎంతో అమానుషంగా ప్రవర్తించారు అంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. హాస్పిటల్‌కి వెళ్లి చూడగా..బాధితుడిని తాళ్లతో మంచానికి కట్టేసి ఉంది. ఇదేంటని ప్రశ్నించగా...ఆయనకు ఫిట్స్ ఉందని అందుకే మంచానికి కట్టేసినట్లు వైద్యులు తెలిపారు. ఇది కూడా చికిత్సలో ఒక భాగం అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యంపై ఐపిసి సెక్షన్ 342 కింద కేసు నమోదు చేసినట్లు షాజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో హాస్పిటల్ యాజామాన్యం కావాలనే మంచానికి కట్టేసిందని తేలడంతో జిల్లా యంత్రాంగం ఆసుపత్రిని సీజ్ చేసింది. (పాఠశాలలు అప్పటి నుంచే మొదలు! )
Comments
Please login to add a commentAdd a comment