వికారుద్దీన్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్/దూద్‌బౌలి: ప్రముఖ ఉర్దూ దినపత్రిక రహెనుమా–ఎ–దక్కన్ చీఫ్ ఎడిటర్ సయ్యద్ వికారుద్దీన్(82) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. హోంమంత్రి మహమూ ద్ అలీ తదితరులు వికారుద్దీన్ నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు. శుక్రవా రం ఉదయం ఆయన నివాసం నుంచి భౌతికకాయాన్ని జనాజేకీ నమాజ్ (అంతిమ ప్రార్థనలు) కోసం మక్కా మసీదుకు తీసుకొచ్చారు.
ఈ ప్రార్థనల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఎంబీటీ, ఎంఐఎం పార్టీల నేతల తోపాటు ముస్లిం మతపెద్దలు, అభిమానులు పాల్గొన్నారు. మక్కా మసీదు నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర లాడ్‌బజార్, ముర్గీచౌక్, మూసాబౌలి మీదుగా హుస్సేనీ ఆలంలోని మూసా ఖాద్రీ దర్గా వరకు సాగింది. తర్వాత అంత్యక్రియలు నిర్వ హించారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీలో డిగ్రీ చదివిన ఆయన 65 ఏళ్లుగా రహెనుమా–ఎ– దక్కన్ పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా సేవలు అందిస్తున్నారు.
ఇటీవలే ఆ పత్రిక వందేళ్లు పూర్తిచేసుకుంది. ముస్లిం దేశాల సమైక్యత కోసం ఆయన ఇండో–అరబ్ లీగ్ సంస్థను స్థాపించారు. ఆయన కృషి వల్లే ఆ సంస్థకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. పాల స్తీనాపై ఇజ్రాయిల్ దురాక్రమణను ఆయన తీవ్రంగా నిరసించేవారు. పాలస్తీనా విమోచనాయోధులు యాసర్ అరాఫత్, మహమూద్ అబ్బాస్, అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌లతో సంబంధాలుండేవి.
భారత్– అరబ్ దేశాల మైత్రి కోసం చేసిన కృషికి 22 అరబ్బు దేశాల లీగ్ సంస్థ ఆయనకు పురస్కా రాన్ని అందజేసింది. స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డునూ అందుకున్నారు. ఆయన మృతికి భారతదేశంతోపాటు అరబ్బు దేశాల దౌత్య కార్యాలయాలు సంతాపం తెలిపాయి. వికారుద్దీన్ మృతిపట్ల సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment