
ముంబై: మహారాష్ట్రలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. థానెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఐసీయూలోని ఆరుగురు రోగులతో సహా మరో 20 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందినవారిని యస్మీన్ జెడ్ సయ్యద్(46), నవాబ్ ఎం షేక్ (47), హలీమా బి.సల్మనీ (70)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మృతుల కుటుంబానికి రూ. ఐదు లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇక, ఇటీవల ముంబైకి సమీపంలోని విరార్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు చెలిరేగిన విషయం తెలిసిందే. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు.
చదవండి:
మహారాష్ట్రలో మరో ఘోరం..
ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’
Comments
Please login to add a commentAdd a comment