
సల్మాన్‌తో ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే (67)
పుణె (ముంబై): ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే (67) అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఆయన గత కొద్దికాలంగా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య ఒక కుమారుడు, కుమార్తె, తల్లి ఉన్నారు.
ఇండియన్ లా సొసైటీ నుంచి లా పట్టాను పొందిన షివాడే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు, షినే అహుజాపై రేప్ కేసులను వాదించారు. వీటితోపాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీ తరఫున కేసును, వజ్రాల వ్యాపారి భరత్‌షా కేసులను షివాడే కోర్టులో వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment