criminal lawyer
-
ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత
పుణె (ముంబై): ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే (67) అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఆయన గత కొద్దికాలంగా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య ఒక కుమారుడు, కుమార్తె, తల్లి ఉన్నారు. ఇండియన్ లా సొసైటీ నుంచి లా పట్టాను పొందిన షివాడే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు, షినే అహుజాపై రేప్ కేసులను వాదించారు. వీటితోపాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీ తరఫున కేసును, వజ్రాల వ్యాపారి భరత్షా కేసులను షివాడే కోర్టులో వాదించారు. చదవండి: (మొబైల్ మింగేశాడు.. ఎండోస్కోపీతో..) -
లాయర్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
సాక్షి, హైదరాబాద్: న్యాయం తరుపున వాదించాల్సిన లాయరే దారి తప్పాడు. భార్య ఉండగానే మరో మహిళతో రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన ఓల్డ్ రామాంతపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన కృష్ణమాచారి అనే క్రిమినల్ లాయర్‌కు 2008లో వింధ్యారాణి అనే మహిళతో వివాహం అయింది. వింధ్యారాణి రాజస్థాన్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. భార్య పంపిస్తున్న డబ్బులతో జల్సాలకు అలవాటయిన కృష్ణమాచారి మరో మహిళతో ఓల్డ్ రామాంతపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టాడు. భర్తకు దూరంగా ఉండలేక స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని వింధ్యారాణి నగరానికి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా భర్త ప్రవర్తనలో మార్పులు గమనించిన వింధ్యా అతడిని ఫాలో అవడం ప్రారంభించారు. మరో మహిళతో అక్రమసంబంధ ఉందని పసిగట్టిన వింధ్య.. స్థానికులు, బంధువుల సహాయంతో శనివారం వీరిద్దరూ ఇంట్లో కలసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి వచ్చిన మీడియాపై కృష్ణమాచారి దుర్భాషలాడారు. ఇక వీరిద్దరిని స్థానికులు సహాయంతో షీ టీమ్అధికారులకు అప్పగించారు. పోలీసుల విచారణలో లాయర్ కృష్ణమాచారి.. పెళ్లి పేరుతో అనేక మంది మహిళలను మోసం చేసినట్లు తెలిసింది. -
సాఫ్ట్వేర్ క్రిమినల్ లాయర్ జైలుకు..
బెంగళూరు: చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సకల ప్రయత్నాలుచేశాడు. అందుకోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వదిలేసి లా చదివి క్రిమినల్ లాయర్‌గా మారాడు. ఏంచేసినా ఫలితం శూన్యం. దీంతో పదేళ్ల కిందట కేసులో శిక్ష పడింది. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన శివప్రసాద్ సజ్జన్ సాఫ్ట్వేర్ ఇంజనీ. ఓ మహిళకు అశ్లీల ఈ–మెయిల్స్ పంపుతూ, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అందరికీ సర్క్యులేట్ చేస్తూ వేధించాడు. బాధిత మహిళ ఫిర్యాదుచేయంతో సజ్జన్‌ను 2008లో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన సజ్జన్.. ఇంజనీరింగ్ జాబ్ వదిలి లా గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేసి క్రిమినల్ లాయర్ అయ్యాడు. కేసును పొడిగించేందుకు చట్టంలోని లొసుగులను వాడాడు. తర్వాత కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. తాజాగా కేసు విచారణ పూర్తయింది. సజ్జన్‌ను దోషిగా నిర్ధారించిన బెంగళూరులోని కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధించింది. -
నేనెప్పుడు చనిపోతానో మీకెందుకు?
ఎవరికైనా 90 ఏళ్ల వయసు దాటిందంటే కృష్ణా రామా అనుకోవడం.. ఎప్పుడు వెళ్లిపోతామా అని చూడటం సర్వసాధారణం. కానీ, కొంతమంది మాత్రం ఎంత వయసు వచ్చినా చురుగ్గానే ఉంటారు. వయసు ప్రభావం శరీరం మీదే కాదు.. మనసు మీద కూడా లేదంటారు. ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ 93 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ ఆయనకు డిమాండు ఏమాత్రం తగ్గలేదు, ఆయన వాదనల్లో వాడి వేడి కూడా తగ్గలేదు. అందుకే సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్ క్రిమినల్ లాయర్. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తిని సైతం నిలదీసి ప్రశ్నించే సత్తా ఆయన సొంతం. సరిగ్గా ఇలాంటి ఘటనే సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ఎంఎం కశ్యప్ అనే న్యాయవాదిని ఆయన ఛాంబర్ ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానికి సంబంధించిన కేసును ఆయన వాదిస్తున్నారు. ఈ సందర్భంలోనే.. మీరెప్పుడు రిటైర్ అవుతున్నారు అంటూ జెఠ్మలానీని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి జెఠ్మలానీ అంతే స్థాయిలో స్పందించారు. ''నేను ఎప్పుడు చనిపోతానని మీరు అడుగుతున్నారు'' అని ఆయన అడిగారు. అంటే.. తాను ఊపిరి ఉన్నంతవరకు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ఉంటానని, కేవలం మృత్యువు మాత్రమే తనను ఆపగలదని ఆయన చెప్పకనే చెప్పారు. దటీజ్ రాం జెఠ్మలానీ. అందుకే హైప్రొఫైల్ కేసులకు సంబంధించి ఏమైనా వాదించాలంటే గంటకు ఇంత అని మాట్లాడుకుని మరీ ఆయనను వివిధ హైకోర్టులకు కూడా రప్పించుకుంటారు.