సాక్షి, హైదరాబాద్: న్యాయం తరుపున వాదించాల్సిన లాయరే దారి తప్పాడు. భార్య ఉండగానే మరో మహిళతో రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన ఓల్డ్ రామాంతపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
ఉప్పల్‌కు చెందిన కృష్ణమాచారి అనే క్రిమినల్ లాయర్‌కు 2008లో వింధ్యారాణి అనే మహిళతో వివాహం అయింది. వింధ్యారాణి రాజస్థాన్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. భార్య పంపిస్తున్న డబ్బులతో జల్సాలకు అలవాటయిన కృష్ణమాచారి మరో మహిళతో ఓల్డ్ రామాంతపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టాడు. భర్తకు దూరంగా ఉండలేక స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని వింధ్యారాణి నగరానికి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా భర్త ప్రవర్తనలో మార్పులు గమనించిన వింధ్యా అతడిని ఫాలో అవడం ప్రారంభించారు. మరో మహిళతో అక్రమసంబంధ ఉందని పసిగట్టిన వింధ్య.. స్థానికులు, బంధువుల సహాయంతో శనివారం వీరిద్దరూ ఇంట్లో కలసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి వచ్చిన మీడియాపై కృష్ణమాచారి దుర్భాషలాడారు. ఇక వీరిద్దరిని స్థానికులు సహాయంతో షీ టీమ్‌అధికారులకు అప్పగించారు. పోలీసుల విచారణలో లాయర్ కృష్ణమాచారి.. పెళ్లి పేరుతో అనేక మంది మహిళలను మోసం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment