illegal affairs
-
తన భర్త తనకి కావాలంటూ నక్షత్ర డిమాండ్
-
బావతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
రాజస్థాన్ లోని ఉదయపూర్ లో బావతో కలిసి ఒక మహిళ తన భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ విషయం 5 నెలల తర్వాత చాలా ఆశ్చర్యకరంగా బయటకి వచ్చినట్లు పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్రంలోని అగర్తల పరిధిలోని నాగ్పాడకు చెందిన 45 ఏళ్ల ఉత్తమ్ దాస్ అనే వ్యక్తి తన అన్నయ్య 51 ఏళ్ల తపన్ దాస్ కలిసి నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉత్తమ్ దాస్ భార్య రూపా దాస్ తో తపన్ దాస్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎప్పటికైనా ఈ విషయం బయటకి వస్తే తమకు ప్రమాదమని గ్రహించి ఉత్తమ్ దాస్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా కిరాయి గుండాలకు డబ్బులు కూడా అందజేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం, రాజస్థాన్ కు వ్యాపార నిమిత్తం వెళ్లి రావాలని ఉత్తమ్ దాస్ కు తపన్ సూచించాడు. ఉత్తమ్ వెళ్లిన రెండు రోజుల తర్వాత తపన్ కూడా కిరాయి గుండాలను తీసుకోని వెళ్లారు. వీరందరూ తన మిత్రులని పరిచయం చేసి సైట్ చూడటానికి పోదామని తపన్ పేర్కొన్నాడు. సైట్ చుడానికి వెళ్తున్న మార్గం మధ్యలో తనకు మత్తు మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. ఉత్తమ్ దాస్ నిద్రలోకి జారుకోగానే అతన్ని చంపి కాళ్లు, చేతులు కట్టేసి నదిలో పడేసారు. ఆ తర్వాత తపన్ దాస్ నాగ్పాడకు వెళ్లి రూపా దాస్ కు పని పూర్తీ అయ్యిందని చెప్పాడు. బందువులకు అడగ్గా వ్యాపార నిమిత్తం అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు. కొద్దీ రోజుల తర్వాత గుర్తు తెలియని మృత దేహం బయటపడినట్లు వచ్చేసరికి. తపన్ దాస్, రూపా దాస్ కలిసి ఉత్తమ్ దాస్ కరోనా చనిపోయాడని తన శవాన్ని కూడా తీసుకురాకుండా అక్కడే పూడ్చిపెట్టినట్లు కట్టుకథ చెప్పారు. అయితే, 5 నెలల తర్వాత ఆస్తిని రూపా దాస్ పేరిట రాయించడానికి భర్త డెత్ సర్టిఫికెట్ అవసరం వచ్చింది. దీనితో వాళ్లు రాజస్థాన్ వెళ్లి ఒక ప్రభుత్వ డాక్టర్ కి డబ్బులు ఇచ్చి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. కానీ, ఆ డాక్టర్ ఈ విషయాన్నీ పోలీసులకు చెప్పడంతో వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం ఈ హత్యలో పాల్గొన్న వాళ్లందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చదవండి: దారుణం: ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం -
చిన్న కోడలితో సంబంధం.. అత్త, పెద్ద కోడలు కలిసి..
లక్నో: చిన్న కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను పెద్ద కోడలితో కలిసి దారుణంగా హత్య చేసిందో భార్య. కోడలితో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని గొంతుకోసి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లా శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోయిరానా గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి నలుగు కుమారులు. వీరిలో ఇద్దరికి కొన్నేళ్ల కింద వివాహం జరిగింది. వీరంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ ముంబైలో కూలీ పనులు చేస్తున్నారు. కాగా,ఇటీవల పెళ్లి అయిన ఇద్దరు కుమారులు భార్యలతో కలిసి అత్తవారింట్లో ఉంటున్నారు. మామ తరచూ ఇద్దరు కుమారుల దగ్గరికి వెళ్లెచ్చేవాడు. ఈ క్రమంలో చిన్న కోడలితో మామకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భార్య, పెద్ద కోడలు.. ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో కోపం పెంచుకున్న మామ.. పెద్ద కోడలు, భార్యపై దాడి చేశాడు. కొద్ది రోజులుగా పెద్ద కోడలు మరో ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. కాగా, ఐదు రోజుల కిందట చిన్న కోడలిని పుట్టింటి నుంచి తన ఇంటికి రప్పించుకున్నాడు మామ. శనివారం రాత్రి ఆమెతో కలిసి ఉండగా ఆ ఇంటికి వచ్చిన భార్య, పెద్ద కోడలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకిని చాకుతో గొంతు కోసి హత్య చేశారు. భయంతో బయటకు పరుగులు తీసిన చిన్న కోడలు, ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. సదరు వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు చెప్పారు. చిన్న కోడలి ఫిర్యాదు మేరకు.. అత్త, తోటి కోడలుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
దారుణం: చంపి, శ్మశానవాటికలో పూడ్చిపెట్టి..
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కనకరాజు అనే వ్యాపారవేత్త ఓ యువకుడిని దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని శ్వశానవాటికలో పూడ్చిపెట్టాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కనకరాజు అనే వ్యాపారవేత్త ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే యువతిని శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ప్రేమించాడు. ఆరు నెలల క్రితం ఆ యువతిని శ్రీకాంత్ రెడ్డి బయటకు తీసుకెళ్లడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరిని తీసుకొచ్చిన కనకరాజు.. జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో బంధించాడు. 10 రోజుల పాటు శ్రీకాంత్‌రెడ్డిని హింసించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపెట్టాడు. మద్యం మత్తులో కనకరాజు ఈ విషయాన్ని తన మిత్రులకు తెలియడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్మశానానికి వెళ్లి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసు సమక్షంలో శ్రీకాంత్‌రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. -
తమ్ముడి ప్రేమ.. అల్లుడిని హత్యచేసిన అత్త
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం ఒక్కరోజే రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. కుమార్తె మృతికి కారణమైన అల్లుడిని ఓ అత్త దారుణంగా హత్య చేయగా, ప్రేమ విషయమై ఓ యువతి సోదరులు ఓ యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. పథకం ప్రకారం... తన కుమార్తె మృతికి కారణమైన అల్లుడిపై కక్ష పెంచుకున్న అత్త పథకం ప్రకారం అతడిని హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రంగస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మీర్‌పేటలో ఉంటున్న అనిత, బాబురావు దంపతులకు ముగ్గురు సంతానం. 10 ఏళ్ల క్రితం బాబూరావు వదిలేసి వెళ్లిపోవడంతో అనిత మీర్‌పేటలో ఉంటూ క్యాటరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన పాలెం నవీన్ కుమార్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచు వారి ఇంటికి వచ్చివెళ్లే నవీన్ కన్ను అనిత చిన్న కూతురు వందన(19)పై పడింది. దీంతో అతను అనితను ఒప్పించి నవంబర్– 2019లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయినా వీరి సంబంధం కొనసాగుతుండటంతో మనస్తాపానికి లోనైన వందన సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు ఆమె తల్లి అనిత, భర్త ననీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం చెరో దారి పట్టారు. అనిత పార్శిగుట్టలో ఉండగా, నవీన్ రామంతాపూర్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాడు. కాగా నవీన్ అనిత అడ్రస్ తెలుసుకున్న బుధవారం రాత్రి ఆమెను రామంతాపూర్‌లోని తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన కుమార్తె మరణానికి, జైల్‌కు వెళ్లడం, కుటుంబానికి దూరం కావడంతో అనిత నవీన్‌పై కక్ష పెంచుకుంది. కాగా బుధవారం రాత్రి ఆత్మహత్య కేసు నుంచి తనను తప్పించాల్సిందిగా, రాజీ కుదుర్చుకునే వీలుగా మాట్లాడాలని అనితను కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారుజామున నవీన్ నిద్ర పోతుండగా కిచెన్‌లో ఉన్న కత్తి తీసుకువచ్చిన అనిత అతడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చింది. నవీన్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం నేరుగా ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో ఇన్స్పెక్టర్ రంగస్వామి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్న ప్రాణం తీసిన తమ్ముడి ప్రేమ అబిడ్స్: తమ్ముడి ప్రేమ వ్యవహారంలో అతని అన్న దారుణ హత్యకు గురైన సంఘటన షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ చాంద్‌పాషా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పురానాపూల్ చంద్రకిరణ్ బస్తీకి చెందిన తారయ్యకు ఇద్దరు కుమారులు మధు(22), అరవింద్(17) ఉన్నారు. జూలాయిగా తిరుగుతున్న మధు ఆరు నెలల క్రితం ఓ దొంగతనం కేసులో అరెస్టై జైలుకు వెళ్లివచ్చాడు. అయితే అదే బస్తీలో ఉంటున్న తన సమీప బంధువు ప్రకాష్ కుమార్తెను మధు తమ్ముడు అరవింద్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ప్రకాష్ కుటుంబ సభ్యులకు తెలియడంతో బుధవారం అతను తన సోదరులతో కలిసి మధు ఇంటికి వెళ్లి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే అరవింద్ వారి మాటలు లెక్క చేయకపోగా నీ కుమార్తెను ప్రేమిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రకాష్ అతని సోదరులు ఇద్దరు అరవింద్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. బుధవారం అర్ధరాత్రి ముగ్గురు అరవింద్ ఇంటికి వెళ్లి బయటికి రావాలని తలుపులు బద్దలు కొట్టారు. అరవింద్ బయటికి రావడంతో ముగ్గురు కలిసి అతడిపై మారణాయుధాలతో దాడిచేశారు. అక్కడికి వచ్చిన మధు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు ముగ్గురు మధుపై దాడికి దిగారు. ఇదే అదనుగా అరవింద్ ఇంటి వెనక ఉన్న బాల్కానీపై నుంచి దూకి పారిపోయాడు. మధు కూడా తప్పించుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు అతడిపై కత్తి, రాడ్లతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. కాగా నిందితులు ముగ్గురు నేరుగా స్టేషన్‌కు వెళ్లి మధు, తన తమ్ముడు అరవింద్ తమపై దాడిచేశారని ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మధు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుళ్లతో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్
కమాన్‌చౌరస్తా(కరీంనగర్): ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హత్య చేసేందుకు భార్య యత్నించగా తప్పించుకున్నానని కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణ కరీంనగర్ టూ టౌన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన ఇంట్లోకి వచ్చి తీవ్రంగా కొట్టి, చంపుతామని బెదిరించారని గంగారపు సమన్విత్ అలియాస్ సన్నీ.. వంశీకృష్ణతోపాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14 తేదీన వంశీకృష్ణ ఇంట్లో ఉండగా సన్నీ, గణేశ్ అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దిండుతో అదిమిపెట్టి శ్వాస ఆడకుండా చేసి హత్యచేయాలని చూడగా బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ఈనెల 17న తన ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించి తన భార్యకు ఫోన్ చేయవద్దంటూ చితకబాదారని వంశీకృష్ణ, శివ, శ్రీధర్‌లతోపాటు మరోముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై సన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా వంశీకృష్ణ భార్యతో సమన్విత్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వివాహేతర సంబందం గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వంశీకృష్ణ భార్య ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరగా, ఇద్దరు పిల్లలు మాత్రం వంశీకృష్ణ వద్దనే ఉన్నట్లు సమాచారం. -
ప్రియుడి కోసం భర్త దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం : ఆర్మీ సిపాయి సతీష్ కుమార్ ఆత్మహత్య కేసును విశాఖ సిటీ పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో సతీష్ భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్ కుమార్, అతని స్నేహితుడు భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సతీష్ సైన్యంలో పనిచేస్తున్నాడు. సతీష్ జమ్మూకశ్మీర్‌లో ఉండగా, భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు విశాఖ సిటీ మద్దిలపాలెంలో ఉంటున్నారు. ఈ క్రమంలో జ్యోతి భరత్ కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె అత్త ఓ సారి మందలించింది. కొద్ది రోజుల తర్వాత సతీష్ డ్యూటీకి నెల రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని ఆమెను నిలదీశాడు. తన వివాహేతర సంబంధం బట్టబయలు కావడంతో భర్తను హతమార్చాలని పన్నాగం పన్నింది జ్యోతి. ప్రియుడు భరత్‌తో కలిసి ప్లాన్ చేసింది. సతీష్ కుమార్ తాగే విస్కీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. సతీష్ నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడు భరత్, అతని స్నేహితుడు భాస్కర్లకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ముగ్గురు కలిసి నిద్రమత్తులో ఉన్న సతీష్ మెడకి చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అదే చున్నీతో ఫ్యాన్ ఫ్యాన్‌కి వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఏమి తెలియనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. జ్యోతీ, భరత్, భాస్కర్లను అరెస్ట్ చేసిన సిటీ పోలీసులు మంగళవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఆర్ కె మీనా ముందు హాజరు పరిచారు. -
కూరగాయల కత్తితో వెంటాడి.. ఆపై
సాక్షి, సరుబుజ్జిలి (శ్రీకాకుళం): ఇరువురికి వేర్వేరు వ్యక్తులతో వివాహమైంది. కూలీ పనుల కోసం వారి కుటుంబాలను విడిచి పెట్టి ఇతర ప్రాంతానికి వలస వెళ్లారు. అక్కడ ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆపై విభేదాలు తలెత్తగా.. తదుపరి హత్యాయత్నానికి ఉసిగొల్పింది. బుధవారం మండలంలోని కొత్తకోట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన అరసవల్లి లక్ష్మి(30)పై ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన సీ రాంబాబు(32) కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. ఎస్సై కే మహాలక్ష్మి వివరాల ప్రకారం... అరసవల్లి లక్ష్మికి తన దగ్గర బంధువు శ్రీనివాసరావుతో గతంలో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదేవిధంగా రాంబాబుకు వివాహమై కుమారుడు ఉన్నాడు. ఇరువురు తమ కుటుంబాలను విడిచి కూలీ పనులకు వెళ్లారు. మూడేళ్లుగా తిరుపతిలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. మరలా కొద్దిరోజుల తర్వాత ఫోన్ల ద్వారా సంబంధాలు పురుద్ధరించారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా తమ స్వంత గ్రామాలకు వచ్చారు. దూరం పెడుతుందనే దాడి... కొత్తకోట గ్రామంలో లక్ష్మి ఉన్నట్లు గ్రహించిన రాంబాబు వచ్చాడు. అప్పటికే పెరట్లో కూరగాయల మొక్కలకు కంచె కడుతున్న ఈమెతో వాగ్వాదం తలెత్తింది. ఫోన్ చేసినా స్పందించలేదన్న కోపంతో అతడు కూరగాయల కత్తితో పొట్టమీద పొడిచాడు. గాయాలతో లక్ష్మి వెంటనే కూలిపోవడంతో తను కూడా కత్తితో కోసుకొని బండరాయితో తలపై మోదుకుని నేలపై పడిపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా 108 వాహనంలో ఆమదాలవలస సమీప జొన్నవలస ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చారు. గాయపడిన లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వివాహేతర సంబంధం.. వరుస హత్యలు
సాక్షి, గుంటూరు : జిల్లాలో వరుసగా జరిగిన మూడు హత్యలు కలకలం రేపుతున్నాయి. వివాహేత సంబంధాలతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఏడుకొండలు (35) అనే వ్యక్తిని నాగయ్య అనే మరోవ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లటూరుకు చెందిన అంకె ఏడుకొండలు పశువుల కాపరి. శుక్రవారం ఉదయం గేదెలను తోలుకొని సమీపంలో అడవికి వెళ్లాడు.శనివారం వరకు ఇంటికి చేరకపోయేసరికి బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సహాయంతో పోలీసులు అడవిలో గాలించగా ఓ ప్రదేశంలో గోనె సంచిలో ఓ మృతదేహం కనిపించింది. తల నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఏడుకొండలు భార్యతో నాగయ్య అనే వ్యక్తికి గత కొంతకాలంగా వివేహేతర సంబంధం ఉందని, ఈ విషయమై వీరివురి మధ్య గొడవలు ఉన్నట్లు గుర్తించారు. నాగయ్య శుక్రవారం సాయంత్రం అడవికి వెళ్లి అతనితో ఘర్షణ పడి ఏడుకొండలను గొడ్డలితో నరికి చంపి సంచిలో మూటకట్టి అక్కడే పడేసి పరారైనట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనుమానంతో గొంతు నులిమి.. దుగ్గిరాలలో మరో దారుణం జరిగింది. పద్మావతి అనే మహిళను సుబ్బారెడ్డి అనే వ్యక్తి హతమార్చాడు. గాంధీనగర్‌కి చెందిన సుబ్బారెడ్డి.. చెన్నకేశవ్‌నగర్‌కి చెందిన పద్మావతి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అనుమానం నేపథ్యంలో పద్మావతిని సుబ్బారెడ్డి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. సుబ్బారెడ్డికి స్థానికులు దేహశుద్ధి చేశారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం పిడుగురాళ్ల పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మీసాల మధు (21) హెచ్‌పీ గ్యాస్ గిడ్డంగి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సురేంద్రబాబు, తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చారు. సంఘటనపై ఆరా తీశారు. గురువారం రాత్రి మధు తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడని, ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగిందని తెలుసుకున్నారు. మధు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కావాలనే హత్య చేశారని బంధువులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పలువురు అనుమానితులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
సాక్షి, నకిరేకల్: మండల పరిధిలోని చిత్తలూరు గ్రామానికి చెందిన గెండెబోయిన మల్లేష్(29)కి సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని జాజిరెడ్డిగూడేనికి చెందిన చీమల లింగయ్య కుమార్తె మమతతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం మల్లేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేష్ తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పంటలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అడ్డు తొలగించుకోవాలని.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని మమత నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన ప్రియుడు సోమయ్యకు చెప్పింది. మల్లేష్ మద్యం మత్తులో ఉండగా తమ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్టుగానే మంగళవారం అర్వపల్లి సంతకు పోయిన మల్లేష్ పూటుగా మద్యం సేవించి తిరిగి వచ్చే క్రమంలో జాజిరెడ్డిగూడెంలోని అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. తలదిండుతో అదిమి.. ఊపిరాడకుండా చేసి.. ఇదే అదునుగా భావించిన భార్య మమత భర్త మద్యం మత్తులో ఉన్నాడనే విషయాన్ని ప్రియుడు సోమయ్యకు చేరవేసింది. మల్లేష్ టీవీ పెట్టుకొని చూస్తూ ఇంటి హాలులోని బెడ్‌పై నిద్రించే క్రమంలో వాంతులు చేసుకుంటూ బెడ్‌పైనుంచి జారి కిందపడ్డాడు. గమనించిన అతని భార్య మల్లేష్‌ను శభ్రపరచి నేలపైనే పడుకోబెట్టింది. రాత్రి 11.30 గంటల సమయంలోనే మల్లేష్ ఇంటికి వచ్చిన సోమయ్య ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు బయటకు రాకుండా బెడ్రూం గడియపెట్టి నడుస్తున్న టీవీ సౌండ్ పెంచారు. మద్యం మత్తులో స్పృహతప్పి ఉన్న మల్లేష్ ముఖంపై తలదిండుతో సోమయ్య బలంగా అదిమిపట్టగా, మమత మల్లేష్ కదలకుండా గట్టిగా కాళ్లు పట్టుకుంది. దీంతో కొద్దిసేపట్లోనే మల్లేష్ మృతిచెందాడు. మల్లేష్ ప్రాణం పోయిన విషయాన్ని నాడి ద్వారా గుర్తిం చిన మమత ఆ పురుగుల మందును మల్లేష్ నోట్లో పోయగా, సోమయ్య శరీరంపై పోశాడు. అనంతరం గుట్టుచప్పుడుకాకుండా సోమయ్య మల్లేష్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడని.. భర్త మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకున్న మమత తెల్లవార్లు్ల నిద్రపోలేదు. బుధవారం తెల్లవారుజా మున ఏమీ తెయనట్లు మల్లేష్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటూ విషయాన్ని సమీపంలో ఉన్న అత్తమామ, బావ కుటిం బీకులకు తెలిపింది. లబోదిబోమంటూ మల్లేష్ తల్లిదండ్రులు, సోదరుడు వచ్చి చూసేసరికి శరీ రంపై పురుగులమందు పోసి ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. మల్లేష్ మృతి చెందిన విషయం గ్రామంలో దావనంలా వ్యాపిం చడంతో గ్రామస్తులు తండోపతండలుగా తరలివచ్చారు. ఆత్మహత్య కాదని, హత్యేనంటూ నిర్ధారణకు వచ్చిన మల్లేష్ కుటుంబీకులు, సమీపబంధువులు, గ్రామస్తులు మమతపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. మల్లేష్ హత్య విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజు సిబ్బందితో చిత్తలూరుకు చేరుకుని ఏలాంటి దాడులు, ఘర్షణలు జరుగకుండా నియంత్రించారు. సంఘటనా స్థలాన్ని సీఐ క్యాస్ట్రోరెడ్డి పరిశీలించారు. మృతుడి భార్య మమతను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను రహస్య ప్రదేశానికి తరలించి విచారించడంతో నేరం అంగీకరించినట్టు తెలిసింది. అందరూ చూస్తుండగానే.. తన సన్నిహితుడైన గుండెబోయిన మల్లేష్‌ను హత్య చేసిన పూల సోమ య్య అలియాస్ సోమన్న మంగళవా రం రాత్రి ఇంట్లోను ఉండి బుధవారం ఉదయం సుమారు 6.00 గంటల సమయంలో భార్య, పిల్లలతో కలిసి ఊరువిడిచి తుడిమిడి రోడ్డుమీదుగా ద్విచక్రవాహనంపై పరారయ్యా డు. గ్రామంలో ప్రధాన రాజకీయపార్టీ నాయకుడుగా ఉన్న సోమయ్యకు నకిరేకల్‌కు చెందిన ఓ మాజీ ఎంపీపీ సమీప బంధువు. ఊరువిడిచి పరారైన సోమయ్య ఎక్కడ తలదాచుకున్నాడో గుర్తించే క్రమంలో పోలీసులు ఉన్నారు. పూల సోమయ్య స్వగ్రామం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి . రెండు దశాబ్దాల క్రితం సోమయ్య తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చిత్తలూరుకు వలసవచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. -
ప్రియుడిపై మోజుతోనే..
సాక్షి, నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో రియల్టర్ సోమకేశవులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతోనే కట్టుకున్న భార్యే తన ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యోదంతంలో భాగస్వాములైన ఐదుగురు నిందితులను ప్రవేశపెట్టి జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని చైతన్యపురిలో నివాసముంటున్న రియల్టర్ సోమ కేశవులు భార్య స్వాతితో శాంతినగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి(సీసీ కెమెరాల ఏర్పాటు) దుబ్బ ప్రదీప్‌తో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం రెండు నెలల క్రితం భర్తకు తెలియడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. తరచుగా ఫోన్లో మాట్లాడడం, వాట్సప్‌లో ఫొటోలు ఉండడంతో ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో స్వాతి తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు రూ.2లక్షలు ఇస్తానని స్వాతి ప్రియుడికి చెప్పింది. హత్య చేసింది ఇలా... ప్రియుడు దుబ్బ ప్రదీప్ సోమ కేశవులును హత్య చేసేందుకు బొట్టుగూడలో ప్రింటర్‌గా పనిచేస్తున్న కొడిదేటి శివకుమార్‌ను సంప్రదించాడు. స్వాతితో తనకున్న సంబంధాన్ని వివరించాడు. స్వాతి భర్త అడ్డు తొలగించాలని చెప్పడంతో హత్యకు ప్లాన్ వేశారు. కొడిదేటి శివకుమార్ మర్రిగూడ మండలంలోని వెంకపల్లి గ్రామానికి చెందిన కంబం ప్రసాద్, బొట్టుగూడకు చెందిన ఆటోడ్రైవర్ చింతపల్లి నగేశ్, ప్రదీప్ అందరూ కలిసి ప్రదీప్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటిపై ఈ నెల 1న మద్యం సేవించారు. కేశవులును హత్య చేసేందుకు రాత్రి 10గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే స్వాతి ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి తాగించింది. కాగా, కేశవులు ఇంకా నిద్రపోలేదని, నిర్ధారించుకొని మళ్లీ వెళ్లి మద్యం తాగారు. కేశవులు భార్య స్వాతి హాల్లో పడుకున్నాడని ప్రదీప్‌కు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే గ్లామర్ బైక్‌పై సుత్తె, టవల్ తీసుకొని వచ్చారు. ఇంటి వెనుక గేట్ నుంచి చిన్నపిల్లల గది ద్వారా హాల్లోకి వచ్చారు. ప్రియుడు ప్రదీప్ ఒక్కసారిగా సోమకేశవులు మెడకు టవల్ గుంజి కట్టాడు. ఊపిరి ఆడకుండా చేశాడు. కొడిదేటి శివకుమార్ సుత్తెతో తలపై కొట్టబోగా సుత్తెకామ ఊసి పడింది. కంబం ప్రసాద్ కేశవులు కాళ్లు కదలకుండా పట్టుకున్నారు. ఊడిపోయిన సుత్తెను తీసుకున్న శివకుమార్ ఛాతిపై గట్టిగా కొట్టాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత దుబ్బ ప్రదీప్, శివకుమార్, ప్రసాద్ కలిసి కేశవులు మృతదేహాన్ని వరండాలో ఉంచారు. ఎవరో డబ్బుల గురించి చంపి పోయారని అనుకునే విధంగా కారం తెచ్చి చల్లారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు స్వాతి బెడ్రూం బయటినుంచి గడియ పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఇలా చిక్కారు... స్వాతి, ప్రదీప్లకు మధ్య వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఫోన్‌కాల్ డేటాను పరిశీలించారు. ఇద్దరూ అనేక సార్లు మాట్లాడుకున్నట్లు నమోదైంది. దీంతో సోమ కేశవులు దహన సంస్కారాల అనంతరం వెంటనే స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రదీప్‌తో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది. అనంతరం నిందితులు జిల్లా కేంద్రంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఉన్నారని పోలీసులు తెలుసుకుని అరెస్ట్ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన వన్‌టౌన్ సీఐని ఎస్పీ, ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ గంగారాం అభినందించారు. హత్యలో పాలుపంచుకుంది వీరే... సోమ కేశవులును హత్య చేసేందుకు భార్య స్వాతి ప్రియుడు ప్రదీప్‌ను ప్రోత్సహించింది. దుబ్బ ప్రదీప్, కంబం ప్రసాద్, శివకుమార్, చింతపల్లి నగేశ్‌లు హత్యకు ప్లాన్ వేశారు. చింతపల్లి నగేశ్ రెండోసారి కేశవులును చంపేందుకు ఇంటికి వచ్చే సమయంలో అధికంగా మద్యం తాగడంతో లేవలేని స్థితిలో ఉన్నాడు. నగేశ్‌ను వదిలేసి శివకుమార్, ప్రసాద్, భార్యస్వాతి, ప్రియుడు ప్రదీప్‌లు కలిసి కేశవులును హత్య చేశారు. -
హిజ్రాతో ఎస్ఐ సహజీవనం!
సాక్షి, చెన్నై : హిజ్రాతో సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబం నడిపారా? అనే విషయంపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. తిరునెల్వేలి జిల్లా, బావూరుసత్రం సమీపానగల రామచంద్రపట్టినం ప్రాంతానికి చెందిన బబితారోజ్ హిజ్రా. ఈమె హిజ్రాల సంక్షేమం కోసం అనేక సాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల హిజ్రాలు లైంగిక వృత్తిని చేపట్టరాదని తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇందుకు పలువురు హిజ్రాలు వ్యతిరేకత తెలిపి బబితారోజ్ ఇంటి ముందు ధర్నా జరిపారు. ఇందుకోసం భద్రతా పనుల నిమిత్తం బావూరుసత్రం పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బబితారోజ్ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఆ సమయంలో ఎస్ఐకు, హిజ్రా బబితారోజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదివరకే వివాహమై భార్య పిల్లలతో ఉన్న ఎస్ఐ హిజ్రా బబితారోజ్‌తో కుటుంబం నడిపినట్లు సమాచారం. ఇటీవల సదరు ఎస్ఐ సమీపానగల మరో పోలీసుస్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత అతను బబితారోజ్‌తో సంబంధం వదులుకున్నారు. హిజ్రా బబితారోజ్ అతన్ని సెల్ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా మాట్లాడేందుకు వీలుకాలేదు. దీంతో బబితారోజ్ తిరునెల్వేలి జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐకు వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ దాన్ని దాచిపెట్టి తనతో కుటుంబం నడిపాడని, అనేకసార్లు ఎస్ఐకు బంగారు నగలు, నగదు అందజేసినట్లు పేర్కొన్నారు. దీంతో తనను మోసగించిన ఎస్ఐపై చర్యలు తీసుకుని, తన నగలు, నగదు తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ ఉత్తర్వులిచ్చారు. తాళయూత్తు డీఎస్పీ బబితారోజ్, సంబంధిత ఎస్ఐ వద్ద ఆదివారం విచారణ జరిపారు. ఇదిలాఉండగా ఎస్ఐ, హిజ్రా ఒకటిగా కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. -
కొడుకు స్నేహితుడితో తల్లి ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని..
చండీగఢ్ : కామమా లేక పిచ్చా తెలియదుగాని 44 ఏళ్ల మహిళ బరితెగించింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని.. తన సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ తల్లి, కన్న కొడుకుని హత్య చేసింది. దీంతో పేగు బంధం కన్న.. అక్రమ సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చిన ఆ తల్లి కటకటాలపాలయింది. ఒళ్లుగగుర్లు పుట్టించే ఈ ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. హరియాణాలోని జజ్జర్ జిల్లా చమన్ పురాకు చెందిన మీనా దేవి (44) అనే మహిళకు ప్రమోద్ (23) అనే కొడుకు ఉన్నాడు. బౌన్సర్‌గా పని చేసే ప్రమోద్ను కలవడానికి అతని స్నేహితుడైన ప్రదీప్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మీనా, ప్రదీప్ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే కొన్ని రోజుల తర్వాత తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరాతీశాడు. నిజం తెలిసి మనస్థాపానికి గురైన ప్రమోద్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అంతేకాకుండా తన స్నేహితుడిని ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రమోద్ను హత్య చేయాలని మీనా, ప్రదీప్‌లు నిశ్చయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రమోద్ ఇంటి వద్ద ఉన్నప్పుడు మీనా తన ప్రియుడు ప్రదీప్‌తో సహా మరో ఇద్దరినీ ఇంటికి పిలిపించి కొడుకును దారుణంగా హత్య చేయించింది. అనంతరం తన కొడుకును ఎవరో హత్య చేశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తల్లి మీనాను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఇంటిచుట్టుపక్కల వారిని విచారించగా అసలు బండారం బయటపడింది. తొలుత సౌరభ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా డొంకంతా కదిలింది. దీంతో తల్లి మీనా, స్నేహితుడు ప్రదీప్, మరో ఇద్దరిని పోలీసులు ఆరెస్టు చేశారు. -
లాయర్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
సాక్షి, హైదరాబాద్: న్యాయం తరుపున వాదించాల్సిన లాయరే దారి తప్పాడు. భార్య ఉండగానే మరో మహిళతో రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన ఓల్డ్ రామాంతపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన కృష్ణమాచారి అనే క్రిమినల్ లాయర్‌కు 2008లో వింధ్యారాణి అనే మహిళతో వివాహం అయింది. వింధ్యారాణి రాజస్థాన్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. భార్య పంపిస్తున్న డబ్బులతో జల్సాలకు అలవాటయిన కృష్ణమాచారి మరో మహిళతో ఓల్డ్ రామాంతపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టాడు. భర్తకు దూరంగా ఉండలేక స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని వింధ్యారాణి నగరానికి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా భర్త ప్రవర్తనలో మార్పులు గమనించిన వింధ్యా అతడిని ఫాలో అవడం ప్రారంభించారు. మరో మహిళతో అక్రమసంబంధ ఉందని పసిగట్టిన వింధ్య.. స్థానికులు, బంధువుల సహాయంతో శనివారం వీరిద్దరూ ఇంట్లో కలసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి వచ్చిన మీడియాపై కృష్ణమాచారి దుర్భాషలాడారు. ఇక వీరిద్దరిని స్థానికులు సహాయంతో షీ టీమ్అధికారులకు అప్పగించారు. పోలీసుల విచారణలో లాయర్ కృష్ణమాచారి.. పెళ్లి పేరుతో అనేక మంది మహిళలను మోసం చేసినట్లు తెలిసింది. -
‘అంతా’ చెట్ల వెనకాలే..!
సాక్షి, కల్వకుర్తి రూరల్: నేరాలు, అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు నిరంతరం నిఘా పెట్టడటంతో పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి, అశ్లీలత వెరసి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దోహదం చేస్తుంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన బొక్కలకుంట కట్ట పట్టణంలోని కూరగాయల మార్కెట్ నుంచి హైదరాబాద్ చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో ఉంది. రహదారి రద్దీగా ఉంటుంది. కట్టపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన ఖాళీ వ్యవసాయ పొలంలో పెద్ద ఎత్తున కంపచెట్లు పెరిగిపోయాయి. రోడ్డు పక్కన చూస్తే కంపచెట్లే కనిపిస్తాయి. ఆ కంప చెట్ల వెనకాల చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లిన సంఘటనలున్నాయి. పోలీస్ వాహనం వచ్చేలోగా అక్కడ ఉన్నవారు పరారవుతుంటారు. యువతే ఎక్కువ కంపచెట్ల వెనకాల జోరుగా జూదం ఆడుతున్నారు. మొత్తం 30ఏళ్లలోపు లోపు యువత ఈ జూదానికి సంబంధించిన పేకాట, చిత్తుబొత్తులకు బానిసలవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతుంది. చీకటి పడితే చాలు జూదంతో పాటు ఆ చెట్ల మధ్య వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇందులోనూ ఒక వర్గానికి చెందిన యువకులు ఎక్కువగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొద్ది మంది వ్యభిచారినులు ఆ చుట్టు పక్కల సంచరిస్తూ విటులను ముఖ్యంగా యువతను పెడదోవ పట్టించడంతో పాటు ఆ ప్రాంతంలోని వారికి సమస్యలు సృష్టిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం కుంట కట్టపై కంప చెట్ల వెనకాల జరుగుతున్న అసాంఘిక కార్యక్రలాపాలపై నిఘా పెంచుతాం. సమాచారం అందిస్తే దాడులు చేసి అడ్డుకుంటాం. చర్యలు తీసుకుంటాం. నర్సింహులు,ఎస్ఐ, కల్వకుర్తి -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
అడ్డగూడూరు(తుంగతుర్తి) : వివాహేతర సంబం ధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. ఈ సంఘటన గురువారం అడ్డగూడూరు మండలం మానాయికుంటలో జరిగింది. మృతుడి బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మానాయికుం ట గ్రామానికి చెందిన మెరుగు కొమురయ్య(36), కొమురమ్మ దంపతులు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కడారి ఇద్దయ్య అనే వ్యక్తితో కొమురమ్మకు పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కొమురయ్యకు తెలియడంతో భార్య కొమురమ్మను పలుమార్లు మందలించా డు. అయినా తనలో ఏ మార్పు రాకపోవడంతో తరచూ భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి. తమ వివాహేతర సంబంధానికి కొమురయ్య అడ్డుగా వస్తున్నాడని భావించిన ఇద్దయ్య, కొమురమ్మ అతన్ని అంతమొందించాలని పథకం పన్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కొమురయ్య ఇంట్లోనే భార్య కొమురమ్మ తన ప్రియుడితో కలిసి దాడి చేసి కొమురయ్యను బాగా కొట్టారు. మర్మావయవాలపై కొట్టడంతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలు తెలు సుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శివనాగప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడికి కూమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
నటన కాస్త శ్రుతి మించడంతో..
శ్రీకాకుళం /పార్వతీపురం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఓ యువకుడు తన ప్రాణాలనే వదులుకోవాల్సి వచ్చింది. తనతో వచ్చిన మహిళ చెప్పిన మాట వినకపోవడంతో బెదిరించాలనే ఉద్దేశంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు నటించాడు. అయితే బెదిరింపు కాస్త శ్రుతిమించడంతో ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. పార్వతీపురం పట్టణ ఎస్సై ఉప్పిలి మహేష్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కోదులగుమడ గ్రామానికి చెందిన ఆవుల రవికి (24), విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరుకు చెందిన ఓ వివాహితతో రెండేళ్లుగా పరిచయం ఉంది. ఇదిలా ఉండగా ఆ వివాహిత తన భర్త వద్దకు వెళ్లడానికి శుక్రవారం విజయవాడ బయలుదేరింది. ఈ విషయం రవికి తెలియజేయడంతో పార్వతీపురంలో కలుద్దామని చెప్పి రమ్మన్నాడు. దీంతో వివాహిత పార్వతీపురంలో దిగి రవిని కలిసింది. అనంతరం పాలకొండ రోడ్డులో ఉన్న లక్ష్మణ్ లాడ్జిలో ఓ గది తీసుకున్నారు. రాత్రంతా అక్కడ గడిపి మరుచటి రోజు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి తనతో సన్నిహితంగా ఉండాలని రవి కోరగా వివాహిత తిరస్కరించింది. దీంతో అసహనానికి గురైన రవి ఆమెను బెదిరిస్తే దారికొస్తుందని భావించి, నువ్వు ఒప్పుకోకపోతే చనిపోతానని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు నటించాడు. ఆ నటన కాస్త శ్రుతి మించడంతో ప్రాణాలమీదకు వచ్చింది. ఉరి వేసుకుంటున్న సమయంలో ముడి బిగిసిపోవడంతో రవి గిలగిలా కొట్టుకున్నాడు. వెంటనే ఆ మహిళ అతడిని కాపాడే ప్రయత్నం చేస్తూ గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న లాడ్జి సిబ్బంది వచ్చి రవిని దించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని కొన ఊపిరితో ఉన్న రవిని పోలీసు వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవికి భార్య, పిల్లలున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పట్టణ ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చీమల మందు తాగించి, బ్లేడ్‌తో కోసి..
రాజమహేంద్రవరం క్రైం: పోలీసుల దర్యాప్తులో శాడిస్టు తల్లి శారద రాక్షస కృత్యాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. సినిమాల్లోని సైకో పాత్రలను మించిన ఆమె క్రూరత్వాన్ని చూసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పు మండలం డీఎస్పీ యు. నాగరాజు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన మచ్చా శారద తన కుమార్తె మహాలక్ష్మిపై బ్లేడ్‌తో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించింది. శారద, శివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి కాగా, చిన్న కుమార్తె నాగేశ్వరి. శారద తనకు తానుగా బ్లేడ్‌తో గాయపరుచుకుని భర్త కొడుతున్నాడంటూ తల్లిదండ్రులకు చెప్పి అతడిపై పోలీసు కేసు పెట్టి విడాకులు తీసుకుంది. దివాన్ చెరువులోని ఒక హాటల్లో పనిచేస్తూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఆ కోపాన్ని శారద తన పిల్లలపై చూపేదని ఇరుగుపొరుగు వారు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి శారద హోటల్లో పని ముగించుకొని ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి భోజనం చేసింది. అల్లరి చేస్తున్న మహాలక్ష్మిని తిట్టి మందలించింది. మహాలక్ష్మి ఇంటి బయట వాకిట్లోని నీళ్ళ డ్రమ్ముని కాళ్ళతో తన్ని నీళ్ళు ఒలకబోసింది. దీంతో శారద కోపంతో ఆ బాలికను కొట్టగా రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. శారద బాలిక వెనుకే తల్లి ఇంటికి వెళ్లి కుమార్తెను జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకు వచ్చింది. తన మాట వినడం లేదంటూ చీమల మందు నీటిలో కలిపి, ఆ నీటిని బలవంతంగా తాగించింది. కుమార్తె సృహ కోల్పోయాక ఆమెను హత్య చేయాలనేది శారద ఉద్దేశం. రాత్రి 12 గంటల సమయంలో కుమార్తెను భుజంపై వేసుకొని దివాన్ చెరువు అంబికా లేఅవుట్లోని పాత బ్రాందీ షాపు దగ్గరలోని శ్మశానం వద్దకు చేరుకుంది. అక్కడి తుప్పల్లోకి తీసుకు వెళ్ళి తువ్వాలును ముక్కలుగా చేసి కుమార్తె కాళ్లు, చేతులు కట్టి బ్లేడుతో బాలిక వంటిపై గాయపరచసాగింది. సృహలోకి వచ్చిన బాలిక ‘అమ్మా కోయవద్దు’ అంటూ కేకలు వేస్తూ బతిమిలాడింది. అయినా కనికరించకుండా గుడ్డలు నోట్లో కుక్కి ముఖంపైన, తలపైన, కాళ్లపైన, బాలిక మర్మావయవాలపైనా ఇస్టానుసారం కోసింది. సృహ కోల్పోయి పడిపోగానే మృతి చెంది ఉం టుం దని భావించి ఎవరికీ తెలియకుండా అర్ధ రా త్రి ఒం టి గంట సమయంలో శారద ఇంటికి చేరుకొంది. శరీరమంతా గాయాలతో అమ్మమ్మ ఇంటికి తెల్లవారుజామున బాలిక మహాలక్ష్మికి సృహ వచ్చింది . ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్ళి తాతయ్యకు జరిగిన విషయం చెప్పింది. అమ్మ వద్దకు తీసుకువెళ్ళవద్దని తాతయ్యను ప్రాధేయపడింది. దీంతో తాతయ్య ఆమె శరీరంపై గాయాలను డెట్టాల్‌తో శుభ్రం చేశాడు. కాగా తెల్లవారు జాము ఐదు గంటలకు శారద తన తండ్రి ఇంటికి వెళ్లి కుమార్తె కనిపించడం లేదంటూ చెప్పింది. దెబ్బలతో రాత్రి ఇంటికి వచ్చిందని, నిద్రపోతున్న లక్ష్మిని చూపించాడు. దీంతో నిందితురాలు శారద జరిగిన విషయం తండ్రికి చెప్పకుండా దాచింది. ఏమీ తెలియనట్టు నటిస్తూ తన తండ్రితో కలిసి కుమార్తెకు వైద్యం చేయించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్‌కు తీసుకు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం సృహలోకి వచ్చిన బాలిక తల్లి తనపై చేసిన అఘాయిత్యం గురించి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి నుంచీ శాడిజమే మచ్చా శారద మొదటి నుంచీ శాడిజంతో ప్రవర్తించేందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లిదండ్రులతో గొడవ పడడం, తండ్రి చెవి కొరికేయడం, చెల్లి, తమ్ముడితో గొడవలు పడి, వారిని కొట్టేది. భర్త శివ కొట్టకపోయినప్పటికీ బ్లేడ్‌తో చేతుల మీద కొసుకొని వచ్చి తల్లికి భర్త కొట్టాడని చెప్పడంలో అది నిజమని నమ్మిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో భర్త శివపై ఫిర్యాదు చేసి అతని నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరితో శారద వివాహేతర సంబంధం సాగించింది. భయంతో బాలిక బూచాడి కథ తాను కొట్టినట్టు ఎవరికైనా చెబితే చచ్చిపోతానని శారద తన కుమార్తె మహాలక్ష్మిని భయపెట్టింది. దీంతో ముసుగు వేసుకొని బూచాడు వచ్చి తనను గాయపరిచాడని ఆ బాలిక తొలుత పోలీసులకు చెప్పింది. అనంతరం అర్భన్ జిల్లా ఎస్పీ రాజకుమారి దర్యాప్తు చేపట్టి బాలిక నుంచి అసలు విషయం రాబట్టారు. బాలికకు వైద్యులు 103 కుట్లు వేశారు. విలేకరుల సమావేశంలో బొమ్మురు సీఐ మోహన్ రెడ్డి, ఎస్సై నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. నిందితురాలు శారదను ఏడో ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. -
అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
చిలకలూరిపేట: ఆరేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మరోవైపు బాలుడి బంధువులు ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం గణపవరానికి చెందిన కొండెబోయిన చెన్నయ్యకు సుమారు పదేళ్ల కిందట ముప్పాళ్ల మండలం పాలపాడుకు చెందిన బుచ్చెమ్మతో వివాహం జరిగింది. ఇద్దరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడు కొండెబోయిన అయ్యప్ప (6) ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆడుకునేందుకు ఇంటినుంచి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులతో కలిసి కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా ఇంటికి అరకిలోమీటరు దూరంలో తుప్పల్లో విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అక్రమ సంబంధమే కారణమా...! వివాహానికి ముందు నుంచి ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన లక్ష్మణ అనే వ్యక్తితో బుచ్చెమ్మకు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా భర్త, పిల్లలను వదిలి తనతో వచ్చేయాలని లక్ష్మణ ఫోన్ల ద్వారా బుచ్చెమ్మను వేధిస్తున్నట్లు బంధువులు తెలిపారు. తనతో రానిపక్షంలో పిల్లలను హతమారుస్తానని పలుమార్లు బెదిరించగా బుచ్చెమ్మ నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి చెందడం, నోటినుంచి నురగ కారి ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ విషయమై రూరల్‌సీఐ శోభన్‌బాబు మాట్లాడుతూ మృతి చెందిన బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. నోటినుంచి నురగ కారి ఉన్నందున ఏదైన పాముకాటు లేదా విషప్రయోగం అనేది పోస్టుమార్టం అనంతరం తెలిసే అవకాశం ఉందన్నారు. మృతిచెందిన బాలుడి తల్లి బుచ్చెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
దారుణం..అనుమానంతో భార్య పీక కోసిన భర్త
-
అనుమానంతో భార్య పీక కోసిన భర్త
పశ్చిమ గోదావరి జిల్లా : నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య పీక కోసి అనంతరం తాను కూడా అదే బ్లేడుతో భర్త పీక కోసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు..చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకటేశ్వరరావుకు నిడదవోలు మండలం పురుషోత్త పల్లి గ్రామానికి చెందిన స్వర్ణతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇదే క్రమంలో కుటుంబ పోషణ నిమిత్తం స్వర్ణ, కువైట్ వెళ్లి 15 రోజుల క్రితం స్వగ్రామం వచ్చింది. అప్పటి నుంచి భార్యపై భర్త వెంకటేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. ఆగ్రహంతో వెంకటేశ్వరరావు బ్లేడుతో స్వర్ణ పీకను కోసి తాను కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర రావు పరిస్థితి విషమంగా ఉందని, భార్య స్వర్ణకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కాటారం : జిల్లాలో సంచలనం సృష్టించిన టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు రామిళ్ల కవిత(35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కాటారం మండలం కొత్తపల్లిలో ఈ నెల 11 అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రామిళ్ల కవితను దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన విషయం విధితమే. కాగా కవిత హత్యకు అసలు కారణం వివాహేతర సంబ ంధమే అని పోలీసులు తేల్చారు. తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కవితను పలుమా ర్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో విరక్తి చెంది పథకం ప్రకారం ఓ భార్య కాంట్రాక్ట్ మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కవితకు కాటారంకు చెందిన రామిళ్ల మల్లయ్యకు గత 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీజ, శిరిణి కూతుర్లు ఉన్నారు. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గత పదేళ్లుగా విడిపోయి కవిత తన తల్లిగారి ఊరైన కొత్తపల్లిలో కూతుర్లతో కలిసి జీవనం సాగిస్తుంది. గత రెండేళ్లుగా టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో కవితకు దూరపు బంధువు వరుసకు బావ అయిన ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరుచు ఇరువురు కలుస్తుండడంతో విషయం కాస్తా సాగర్ భార్య సుజాతకు తెలియడంతో వారిద్దరిపై నిఘా పెంచింది. గత ఏడాది కవిత–సాగర్లు కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సుజాత పద్ధతి మార్చుకోవాలని కవితను తీవ్రంగా మందలించింది. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో పాటు పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు. ఇదంతా జరిగినప్పటికీ కవిత–సాగర్ల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో తన భర్త ఎక్కడ దూరమవుతాడో తన పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర మనోవేదనకు గురైన సుజాత తన పిల్లలతో కలిసి పలుమార్లు ఆత్మహత్యకు యత్నించింది. హత్యకు ప్లాన్ జరిగిందిలా.. గత కొంత కాలంగా సాగర్–సుజాత ఇంట్లో ఆశ్రయం పొందుతున్న వెంకటాపూర్ మండల పెద్దాపూర్ గ్రామానికి చెందిన రజనీకాంత్‌కు తన బాధను చెప్పుకొని సుజాత కన్నీరుమున్నీరయింది. ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని నీ జీవితాన్ని నాశనం చేస్తున్న కవితను అడ్డుతప్పిస్తే ఎలాంటి గొడవ ఉండదని అది నేను చూసుకుంటానని రజనీకాంత్ సుజాతకు భరోసా కల్పించాడు. కవితను హత్య చేయించాలని నిర్ణయానికి వచ్చిన సుజాత రజనీకాంత్ సాకారం కోరుతుంది. గతంలో ప్రజాప్రతిఘటన కొరియర్‌గా పని చేసిన రజనీకాంత్ పెద్దాపూర్ గ్రామానికి చెందిన నిషేధిత పీపీజీ కొరియర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పని చేసిన కన్నూరి కుమారస్వామిని సంప్రదించాడు. కుమారస్వామి కవితను చంపేందుకు ఒప్పుకోవడంతో సాగర్ భార్య సుజాతతో రజనీకాంత్ ఫోన్లో మాట్లాడించి రూ.5లక్షలకు సుపారి మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉండి విభేధాలతో దూరమైన కొత్తపల్లి మాజీ ఉపసర్పంచ్ చిట్యాల చంద్రయ్య ద్వారా కవిత కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న సుజాత సమాచారాన్ని కుమారస్వామికి చేరవేస్తూ వచ్చింది. కవితను హత్య చేసేందుకు రజనీకాంత్, కుమారస్వామి, బస్వరాజుపల్లికి చెందిన కుక్కుమూడి అశోక్, పందికుంటకు చెందిన దుప్పటి మోహన్ అలియాస్ చింటూ, మాడుగుల జగదీశ్, హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆత్కూరి రాజుతో కలిసి ఫిబ్రవరి నెల నుంచి పలుమార్లు కొత్తపల్లికి వచ్చి కవిత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. మార్చి 11 అర్థరాత్రి అశోక్, రజనీకాంత్, మలుగు మండలం పందికుంటకు చెందిన నూనుగంటి చిరంజీవి అలియాస్ అభిలాష్‌తో కలిసి భూపాలపల్లిలో చేతి గ్లౌజులు, మంకీ క్యాప్స్, కిచెన్ నైఫ్స్ కొనుక్కొని కొత్తపల్లికి చేరుకున్నారు. కవిత తన ఇంట్లో పెద్ద కూతురు శ్రీజతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనక గల తలుపులు లేని కిటీకి నుంచి అశోక్, చిరంజీవి మంకీ క్యాప్‌లు ధరించి ఇంట్లోకి వెళ్లగా రజనీకాంత్ ఇంటి బయట కాపలగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కలిసి నిద్రిస్తున్న కవితను తమ వెంట తెచ్చుకున్న కత్తులతో కవిత ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించగా పక్కనే నిద్రిస్తున్న శ్రీజ నిద్రలేచి కేకలు వేయబోగా దుండగులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న కత్తిపీటతో కవిత ముఖం, గొంతుపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురైన కవిత అక్కడికక్కడే మృతి చెందింది. కవిత మృతి చెందినట్లు నిర్థారించుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ రాజమహేంద్రనాయక్, కాటారం డీఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, నరేశ్, రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం ద్వారా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. కవిత కాల్ డేటా, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు కూతురు శ్రీజ చెప్పిన వివరాలను తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చివరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య మిస్టరీ వీడినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఏడుగురు నిందితులు సుజాత, రజనీకాంత్, కుమారస్వామి, అశోక్, మోహన్, చంద్రయ్య, జగదీష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కాగా హత్యలో పాల్గొన్న మరో నిందితుడు చిరంజీవి, హత్యతో సంబంధం ఉన్న రాజులు పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని పట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, రాజు, నరేశ్‌లను ఈ సందర్భంగా డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : వివాహేతర సంబంధం ఇద్దరి బలవన్మరణానికి కారణమైంది. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో ఓ హోం గార్డు, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన కనకాల శ్యాంప్రసాద్ (38) వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హోం గార్డు (హెచ్ 181) గా పని చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడ పిల్లల సంతానం ఉన్నారు. కుటుంబంతో కలిసి సింగ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శ్యాంప్రసాద్‌కు కొన్ని నెలల క్రితం ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలియడంతో అతను శ్యాంప్రసాద్‌పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులతో పాటు తన భార్యకు, బంధువులకు కూడా తెలియడంతో అవమానభారంతో కుంగిపోయిన శ్యాంప్రసాద్ శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే ఆదివారం ఉదయం నున్న సమీపంలోని సుబ్బయ్యకుంట పొలాల్లో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని సమాచారం రావడంతో నున్న సీఐ ఎంవీ దుర్గారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, చనిపోయింది హోం గార్డు శ్యాంప్రసాద్గా తేలింది. ఇంట్లో పరువు పోయిందనే అవమానంతో తన ఉద్యోగం కూడా పోతుందనే భయంతో శ్యాంప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్యాంప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇక ఎన్నడూ ఏ పాపం చేయనని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన శ్యాంప్రసాద్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలను పెట్టుకొని అతని భార్య బోరున విలపిస్తోంది. ప్రియురాలి ఆత్మహత్య కాగా, శ్యాంప్రసాద్‌తో వివాహేతర సంబంధం నెరుపుతున్న మధురానగర్‌కు చెందిన షేక్ నూర్జహాన్ (38) కూడా ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తన ఇంట్లో పురుగు మందు తాగి అఘాయిత్యం చేసుకుంది. అయితే, ఇద్దరూ ముందుగా అనుకుని ఆత్మహత్య చేసుకున్నారా, లేదా శ్యాంప్రసాద్ ఆత్మహత్య విషయం తెలిసి నూర్జహాన్ అఘాయిత్యానికి పాల్పడిందా అన్నది తెలియరాలేదు. -
స్టాఫ్‌తో మంత్రుల సెక్స్.. ప్రధాని కీలక నిర్ణయం
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, వారి సిబ్బందికి మధ్య శృంగార సంబంధాలపై నిషేధం విదిస్తూ టర్న్‌బుల్ గురువారం కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. డిప్యూటీ ప్రధాని బర్నాబై జోయ్స్ కి 24 ఏళ్ల కిందటే వివాహం కాగా, తన వద్ద గతంలో పనిచేసిన ఓ సెక్రటరీతో లైంగిక సంబంధాలు కొనసాగించారు. ఈ ఏప్రిల్‌లో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. దీనిపై ప్రధాని మాల్కం టర్న్‌బుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ నేషనల్ పార్టీకి చెందిన మంత్రి బర్నాబై జోయ్స్పై వేటు వేస్తూ ఆయనను బహిష్కరిస్తే అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. పార్లమెంట్ నుంచి జోయ్స్ను బహిష్కరిస్తే కేవలం ఒక సీటు మేజార్టీకే పరిమితం కావాల్సిఉంటుందని దాంతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లిబరల్ పార్టీ, నేషనల్ పార్టీలు కూటమిగా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని సమయాల్లో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నందుకు ప్రధాని టర్న్‌బుల్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మంత్రులు ఎవరైనా సరే తమ కింద, తమ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది విభాగంలో ఎవరితోనూ శృంగారంలో పాల్గొనవద్దని, లైంగిక సంబంధాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బందికి పెళ్లయిందా, లేదా అన్న విషయాలతో సంబంధమే లేకుండా సెక్స్ బ్యాన్ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. పనిచేసే చోట ఆహ్లాదకర వాతావరణం మాత్రమే ఉంటే మంచిదన్నారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్ తాత్కాలిక ప్రధానిగా జోయ్స్ వచ్చే వారం ప్రధాని టర్న్‌బుల్ అమెరికాలో పర్యటించనున్నారు. అక్రమ సంబంధం కొనసాగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ప్రధాని బర్నాబై జోయ్స్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాషింగ్టన్లో అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్‌తో టర్న్‌బుల్ భేటీ కానున్న విషయం తెలిసిందే. -
కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్) : వివాహే తర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందో ఇల్లాలు. సంచలనం సృష్టించిన ఈ హత్యోందతం డిచ్పల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి జీపీ పరిధి గల త్రయంబక్పేట్లో జరిగింది. డిచ్‌పల్లిలో మంగళవారం నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 4న త్రయంబక్‌పేట్ శివారులో మైలారం మల్లయ్య పంట పొలం వద్ద కట్ట నర్సయ్య(42) మృతదేహం లభించింది. వీఆర్వో ముచ్కురి సాయన్న ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుతో పోలీసులు దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నివేదికలో మృతుడిని గొంతు నులిమి హత్య చేశారని తేలింది. మృతుడి భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. డిచ్పల్లికి చెందిన మేకల సాగర్‌తో, మంజులకు 9 నెలల క్రితం ఇందల్వాయి మార్కెట్లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్తను అడ్డుతొలగించుకుంటే తమకు స్వేచ్ఛ ఉంటుందని మంజుల ప్రియుడితో కలిసి పథకం వేసింది. మల్లయ్య పంట పొలం వద్దకు రాత్రి పూట కాపలాకు వెళ్తున్నాడు. ఇదే అదునుగా భావించిన మంజుల ఆదివారం రాత్రి ప్రియుడు సాగర్‌కు ఫోన్ చేసి త్రయంబక్పేట్కు రప్పించింది. అర్ధరాత్రి గుడిసె వద్ద నిద్రిస్తున్న నర్సయ్యను ఇద్దరు కలిసి హత్య చేశారు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారితో తన భర్త ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తుందని నాటకమాడింది. కొందరు గ్రామస్తులతో గుడిసె వద్దకు వెళ్లగా నర్సయ్య మృతి చెంది ఉన్నాడు. ఏమీ తెలియని దానిలా అందరి ఎదుట శవం పై పడి దొంగ ఏడ్పులు ఏడ్చిన మంజు ల అసలు నిందితురాలని తేలడంతో గ్రామస్తులు నివ్వెర పోయారు. హత్య జ రిగిన 24 గంటల్లోనే కేసు ఛేదించి నిం దితులను అరెస్టు చేసిన డిచ్పల్లి సీఐ రామాంజనేయులు, ఇందల్వాయి ఎస్ఐ రాజశేఖర్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు కిరణ్ గౌడ్, మురళిని ఏసీపీ అభినందించారు. నిందితులు మంజుల, సాగర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలున్నారు. వారు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.