సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, వారి సిబ్బందికి మధ్య శృంగార సంబంధాలపై నిషేధం విదిస్తూ టర్న్‌బుల్ గురువారం కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. డిప్యూటీ ప్రధాని బర్నాబై జోయ్స్ కి 24 ఏళ్ల కిందటే వివాహం కాగా, తన వద్ద గతంలో పనిచేసిన ఓ సెక్రటరీతో లైంగిక సంబంధాలు కొనసాగించారు. ఈ ఏప్రిల్‌లో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. దీనిపై ప్రధాని మాల్కం టర్న్‌బుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ నేషనల్ పార్టీకి చెందిన మంత్రి బర్నాబై జోయ్స్‌పై వేటు వేస్తూ ఆయనను బహిష్కరిస్తే అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. పార్లమెంట్ నుంచి జోయ్స్‌ను బహిష్కరిస్తే కేవలం ఒక సీటు మేజార్టీకే పరిమితం కావాల్సిఉంటుందని దాంతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
లిబరల్ పార్టీ, నేషనల్ పార్టీలు కూటమిగా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని సమయాల్లో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నందుకు ప్రధాని టర్న్‌బుల్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మంత్రులు ఎవరైనా సరే తమ కింద, తమ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది విభాగంలో ఎవరితోనూ శృంగారంలో పాల్గొనవద్దని, లైంగిక సంబంధాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బందికి పెళ్లయిందా, లేదా అన్న విషయాలతో సంబంధమే లేకుండా సెక్స్ బ్యాన్ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. పనిచేసే చోట ఆహ్లాదకర వాతావరణం మాత్రమే ఉంటే మంచిదన్నారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్
తాత్కాలిక ప్రధానిగా జోయ్స్
వచ్చే వారం ప్రధాని టర్న్‌బుల్ అమెరికాలో పర్యటించనున్నారు. అక్రమ సంబంధం కొనసాగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ప్రధాని బర్నాబై జోయ్స్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాషింగ్టన్‌లో అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్‌తో టర్న్‌బుల్ భేటీ కానున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment