Malcolm Turnbull
-
ప్రధాని భార్యపై కామెంట్.. జోకులు
సిడ్నీ: భాష.. దాని అనువాదంలో వచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. పొరపాటున తేడాలు వస్తే అర్థాలు మారిపోయి ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. తాజాగా ఫ్రాన్స్ ప్రధాని ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ భార్య లూసీని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మాక్రోన్.. మాల్కోమ్తో బుధవారం కీలక సమావేశంలో పాల్గొన్నారు. భేటీ ముగిశాక మాల్కోమ్ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఓ సందేశం ఇచ్చారు. ‘మీరిచ్చిన స్వాగతానికి ధన్యవాదాలు. మీకు, మీ ‘రుచికరమైన’ (Delicious)భార్య ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు’ అంటూ మాక్రోన్ పేర్కొన్నారు. అంతే... ఆ మాట ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించేసింది. ‘నోరు జారిన ఫ్రాన్స్ అధ్యక్షుడు’.. ‘ప్రధాని భార్యపై అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలు’.. అంటూ హెడ్డింగ్లతో ఊదరగొట్టేసింది. మరోపక్క సోషల్ మీడియాలో మాక్రోన్ స్టేట్మెంట్పై జోకులు పేలాయి. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందో? అని కొందరు.. వైన్ బదులు వైఫ్ అని పొరపాటున ఉచ్ఛరించారేమో అని కొందరు.. చాలా మందికి మట్టు ఆ కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ కార్యాలయం స్పందన... ‘నిజానికి ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు. అనువాద దోషంలో దొర్లిన ఓ తప్పిదం మూలంగానే ఆయన ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్ వంటకాలతో, ఫ్రెంచ్ అధికారులతో ఏర్పాసిన డిన్నర్ పట్ల మాక్రోన్ సంతోషం వ్యక్తం చేశారు. అందుకే టర్న్‌బుల్-ఆయన భార్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. Delicious-Delicieux ఫ్రెంచ్‌లో-Delightful(చూడముచ్చటైన) అర్థం. ఫ్రెంచి అనువాదకుడి ఉపన్యాసాన్నే మాక్రోన్ చదివి వినిపించారు. దీనిపై పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదు’ అని ఆస్ట్రేలియాలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అన్నట్లు గతేడాది ఫ్రాన్స్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆ సమయంలో మాక్రోన్ భార్య బ్రిగెట్టేను ఉద్దేశించి ట్రంప్ చేసిన ఓ వ్యాఖ్య చర్చనీయాంశమైంది. "I want to thank you for your welcome, thank you and your delicious wife for your warm welcome," -
స్టాఫ్‌తో మంత్రుల సెక్స్.. ప్రధాని కీలక నిర్ణయం
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, వారి సిబ్బందికి మధ్య శృంగార సంబంధాలపై నిషేధం విదిస్తూ టర్న్‌బుల్ గురువారం కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. డిప్యూటీ ప్రధాని బర్నాబై జోయ్స్ కి 24 ఏళ్ల కిందటే వివాహం కాగా, తన వద్ద గతంలో పనిచేసిన ఓ సెక్రటరీతో లైంగిక సంబంధాలు కొనసాగించారు. ఈ ఏప్రిల్‌లో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. దీనిపై ప్రధాని మాల్కం టర్న్‌బుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ నేషనల్ పార్టీకి చెందిన మంత్రి బర్నాబై జోయ్స్పై వేటు వేస్తూ ఆయనను బహిష్కరిస్తే అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. పార్లమెంట్ నుంచి జోయ్స్ను బహిష్కరిస్తే కేవలం ఒక సీటు మేజార్టీకే పరిమితం కావాల్సిఉంటుందని దాంతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లిబరల్ పార్టీ, నేషనల్ పార్టీలు కూటమిగా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని సమయాల్లో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నందుకు ప్రధాని టర్న్‌బుల్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మంత్రులు ఎవరైనా సరే తమ కింద, తమ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది విభాగంలో ఎవరితోనూ శృంగారంలో పాల్గొనవద్దని, లైంగిక సంబంధాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బందికి పెళ్లయిందా, లేదా అన్న విషయాలతో సంబంధమే లేకుండా సెక్స్ బ్యాన్ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. పనిచేసే చోట ఆహ్లాదకర వాతావరణం మాత్రమే ఉంటే మంచిదన్నారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్ తాత్కాలిక ప్రధానిగా జోయ్స్ వచ్చే వారం ప్రధాని టర్న్‌బుల్ అమెరికాలో పర్యటించనున్నారు. అక్రమ సంబంధం కొనసాగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ప్రధాని బర్నాబై జోయ్స్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాషింగ్టన్లో అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్‌తో టర్న్‌బుల్ భేటీ కానున్న విషయం తెలిసిందే. -
ఆగిన పెళ్లి.. ప్రధాని హర్షం!
► పెళ్లికి అడ్డంకిగా మారిన ఫేస్బుక్ పోస్ట్ సిడ్నీ: సోషల్ మీడియాలో తాను చేసిన ఓ పోస్ట్ ఏకంగా తన పెళ్లినే ఆపేస్తుందని ఆ యువతి భావించలేదు. ఆమె ఫేస్బుక్ పోస్టును సాకుగా చూపిస్తూ చర్చి నిర్వాహకులు మరికాసేపట్లో జరగబోయే యువతి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో చోటుచేసుకుంది. ఇంతకు యువతి చేసిన పోస్ట్ ఏంటంటారా.. స్వలింగ సంపర్క వివాహాలకు మద్ధతు తెలుపుతూ తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో షేర్ చేయడమే. విక్టోరియాలోని బల్లారట్లో ఓ చర్చిలో యువతి, తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి వచ్చింది. చర్చి పెద్దలు వారి వివరాలు కనుక్కున్నారు. మరికాసేపట్లో వివాహం జరగనుండగా స్వలింగ సంప్కర వివాహానికి (గే మ్యారేజ్) మద్ధతుగా వధువు చేసిన ఫేస్బుక్ పోస్ట్ గురించి తెలుసుకున్న మత పెద్దలు కార్యక్రమాన్ని రద్దుచేశారు. వివాహాలకు సంబంధించిన చట్టాలలో మార్పులు తీసుకురావాలని తన పోస్ట్‌లో ఆమె పేర్కొంది. ఇలాంటి తరహా వివాహాలకు (గే, లెస్బియన్ వివాహాలు) ఇక్కడ చట్టబద్ధత లేదని చర్చి మినిస్టర్ ఎబెనజర్ సెయింట్ జాన్ వెల్లడించారు. వివాదానికి కారణమైన యువతి ఎఫ్బీ పోస్ట్‌పై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ స్పందించారు. పెళ్లిని నిలిపివేస్తూ చర్చి మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతించాలి. ఇంకా చెప్పాలంటే చర్చికి ఉన్న ప్రత్యేక అధికారాల కారణంగా వారు ఆ వధువు పెళ్లిని నిలిపివేశారని చెప్పారు. క్యాథలిక్ చర్చిలో అయితే రెండోపెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారి వివాహాన్ని సమ్మతించరని వెల్లడించారు. -
మహిళ మృతిపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్బ్రాంతి
వాషింగ్టన్: ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసిన పాపానికి పోలీసుల కాల్పుల్లో తమ దేశ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాదంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ విచారం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే షాకింగ్, అవాంఛనీయ దుర్ఘటన అని ప్రధాని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి క్షమాపణ చెప్పడం తప్ప చేసేదేం లేదన్నారు. 'జూనియర్ పోలీసు కాల్పుల్లో మహిళ ప్రాణాలతో బయటపడి ఉండే బాగుండేది. నిస్సహాయురాలైన మహిళపై ఆయుధాలతో కాల్పులకు పాల్పడి మా పోలీసు తప్పిదం చేశారని' మిన్నెపోలీస్ చీఫ్ జేన్ హార్ట్యూ అన్నారు. అసలేం జరిగిందంటే.. అస్ట్రేలియాకు చెందిన జస్టిన్ రస్జెక్ అనే 40 ఏళ్ల మహిళ గడ మూడేళ్లుగా అమెరికాలోని మిన్నెపోలిస్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్థానిక వ్యాపారి డాన్ డామండ్(50) తో ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లో ఈ జంట వైవాహిక జీవితంలో అడుగుపెట్టనుంది. అయితే గత శనివారం (జూలై 15న) రాత్రి రస్జెక్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పొరుగింట్లో ఏదో గొడవ జరగడంతో ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న బృందంలోని ఓ మహిళా పోలీసు తమ వాహనంలోంచి ఓ ఇంటి కిటికీ వైపు కాల్పులు జరిపింది. కిటికీ పక్కనే ఉన్న రస్జెక్ కు బుల్లెట్ తగిలి కుప్పకూలి చనిపోయింది. ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని గుర్తించిన డాన్ డామండ్, అతడి కుమారుడు జక్ డామండ్ లు కన్నీరు మున్నీరయ్యారు. చుట్టుపక్కల వాళ్లను డామండ్ సంప్రదించగా పోలీసులు కాల్పులు జరపడంతో రస్జెక్ చనిపోయి ఉండొచ్చునని జరిగిన విషయాన్ని చెప్పారు. దీనిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, కాల్పులకు పాల్పడ్డ మహిళా పోలీసు తన తప్పును అంగీకరించారు. రస్జెక్ కు కాబోయే భర్త డాన్ డామండ్కు క్షమాపణ చెప్పారు. కాల్ అందిన వెంటను అక్కడికి వెళ్లగా.. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తివైపు కాల్పులు జరపగా ఈ విషాదం జరిగినట్లు వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఉగ్రవాదాన్ని అంతంచేయాలి
ఆసిస్ ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిలీ: ప్రపంచంలో పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని, అందుకు శాంతి కాముక దేశాలన్నీ తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ సోమవారం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం సమర్థించదగినది కాదనేది భారత్ అభిమతం. దీన్ని ఏ రూపంలో ఉన్నా సమగ్రమైన కార్యాచరణతో ప్రపంచంలోని శాంతికాముక దేశాలన్నీ కలసి తుదముట్టించాలి’అన్నారు. శిలాజ ఇంధన పొదువు, కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని విస్తరించడంలో భాగంగా అణు ఇంధన శక్తిని పెంచుకొనేందుకు భారత్ అడుగులు వేస్తోందన్నారు. -
మెట్రోలో మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని సెల్ఫీ
-
మోదీతో సెల్పీ దిగిన టర్న్‌బుల్
-
మెట్రోలో మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని సెల్ఫీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మెట్రో రైలులో ప్రయాణించారు. సోమవారం సాయంత్రం మండి హౌస్ మెట్రో స్టేషన్ నుంచి అక్షరధామ్ ఆలయం వరకు ఇరు దేశాల ప్రధానులు రైలులో విహరించారు. భారత పర్యటనకు వచ్చిన టర్న్‌బుల్‌తో కలసి ప్రధాని మోదీ తొలుత మండి హౌస్ మెట్రో స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లోని ప్రయాణికులకు వారు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మోదీ, మోదీ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. రైలులో ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్.. మోదీతో సెల్ఫీ దిగారు. మోదీ ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో కలసి ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణించామని మోదీ ట్వీట్ చేశారు. ఇద్దరూ అక్షర్ ధామ్ ఆలయాన్నిసందర్శించారు. -
భారత్‌లో ఆస్ట్రేలియా ప్రధాని
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వాగతం పలికారు. ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో బంధాల బలోపేతానికి టర్న్‌బుల్ భారత ప్రధానితో చర్చలు జరుపుతారు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను భారత్ ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. -
ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌లో పర్యటన
-
దేశ ప్రధానికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన ట్రంప్!
దూషించి.. గద్దించి.. మధ్యలో కాల్ కట్ చేసిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కం టర్న్బాల్కు గట్టి షాకే ఇచ్చారు. ఇటీవల టర్న్బాల్కు ఫోన్ చేసిన ట్రంప్.. శరణార్థుల ఒప్పందం విషయంలో ఆయనపై మండిపడ్డారు. గట్టిగా దూషించి.. మందలించి.. మాట్లాడుతుండగానే మధ్యలోనే ట్రంప్ కాల్ కట్ చేసినట్టు ‘వాషింగ్టన్ పోస్టు’ ఓ కథనంలో తెలిపింది. అమెరికాకు ఆస్ట్రేలియా అత్యంత సన్నిహిత దేశం. కాబట్టి ట్రంప్-టర్న్బాల్ మధ్య సత్సంబంధాలు ఉంటాయని అందరూ భావించారు. అయితే, శరణార్థుల విషయంలో ఒబామా సర్కారుతో ఆస్ట్రేలియా చేసుకున్న ఒప్పందం విషయంలో ట్రంప్ టర్న్బాల్పై గుస్సా అయినట్టు తెలుస్తోంది. అయితే, తనను ట్రంప్ తీవ్రంగా మందలించి.. మధ్యలోనే కాల్ కట్ చేసినట్టు వచ్చిన కథనంపై కామెంట్ చేసేందుకు టర్న్బాల్ నిరాకరించారు. ఇది పూర్తిగా ప్రైవేటు సంభాషణ అని ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా తీరప్రాంతంలో ఉన్న దాదాపు 1600 మంది శరణార్థులను మార్చుకునే విషయంలో గత ఒబామా సర్కారుతో ఆస్ట్రేలియా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. శరణార్థుల రాకను నిషేధిస్తూ ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. ఈ పాత ఒప్పందాన్ని కొనసాగించేందుకు ట్రంప్ అంగీకరించారని ట్రర్న్బాల్ గత సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో టర్న్బాల్పై ట్రంప్ మండిపడినట్టు తెలుస్తోంది. -
టర్న్బుల్కే ఆసీస్ ప్రధాని పీఠం!
ఓటమిని అంగీకరించిన విపక్ష నాయకుడు మెల్బోర్న్ : ఉత్కంఠరేపిన పోరులో ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా 61 ఏళ్ల మాల్కమ్ టర్న్‌బుల్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. హోరాహోరీగా సాగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని టర్న్‌బుల్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమి విజయం సాధించింది. దీంతో 8 రోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపునకు ఆదివారంతో తెరపడింది. మొత్తం 150 సీట్లున్న పార్లమెంటులో లిబరల్-నేషనల్ కూటమి 74 స్థానాలు దక్కించుకుంది. బిల్ షార్టెన్ నాయకత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ 66 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగిలిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే లిబరల్-నేషనల్ కూటమికి 76 సీట్లు కావాలి. ఈనెల 2న ఎన్నికలు జరిగాయి. ఈ విజయం అందరి కృషి ఫలితమని టర్న్‌బుల్ చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి సహకరించి, తమను గెలిపించిన ఆస్ట్రేలియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సుస్థిర పాలనే తమకు పట్టం కట్టిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈసారి పార్లమెంటులో చాలా కొత్త ముఖాలు కనిపించనున్నాయని, వారిలో గొప్ప నాయకులెందరో ఉన్నారన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నానన్నారు. ‘భవిష్యత్ తరాలకు మేం ట్రస్టీలం. కనుక ఏం చేసినా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేయాలి’ అని ప్రధాని అన్నారు. గవర్నర్ జనరల్ విదేశీ పర్యటనలో ఉన్నందున టర్న్‌బుల్ ప్రమాణస్వీకారోత్సవానికి కనీసం వారం రోజులు పట్టేట్టుందని స్థానిక మీడి యా సమాచారం. ఫలితాల వెల్లడికి ముందే విపక్ష నాయకుడు షార్టెన్ సంచలనాత్మకంగా తన ఓటమిని అంగీకరించారు. ఆసీస్ ప్రధాని మళ్లీ టర్న్బుల్లే అని, ప్రజా సంక్షేమంలో ఆయనకు తన మద్దతు ఉంటుందన్నారు. -
మత పెద్దను ఆహ్వానించడంపై ప్రధాని విచారం
సిడ్నీ: స్వలింగ సంప్కరులను వ్యతిరేకించిన ఇస్లాం మత పెద్ద షేక్ షాడీ అల్సులీమాన్ ను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం పట్ల ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక నివాసం కిరిబల్లి హౌస్ లో గురువారం నిర్వహించిన రంజాన్ విందుకు అల్సులీమాన్ తో పాటు పలువురు ముస్లిం పెద్దలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 2013లో స్వలింగ సంప్కరులకు వ్యతిరేకంగా అల్సులీమాన్ మాట్లాడిన వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వాధ్యులు వ్యాప్తి చెందడానికి, సమాజం గతి తప్పడానికి స్వలింగ సంపర్కులు కారణమవుతున్నారని అల్సులీమాన్ అందులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా నేషనల్ ఇమామ్ ల సంఘానికి అధ్యక్షుడైన అల్సులీమాన్ చేసిన వ్యాఖ్యలను టర్నబుల్ ఖండించారు. బహుళ సంస్కృతులకు ఆలవాలమైన ఆస్ట్రేలియాలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదన్నారు. అల్సులీమాన్ చేసిన వ్యాఖ్యల గురించి ముందే తెలిసివుంటే ఆయనను విందుకు ఆహ్వానించేవాడిని కాదన్నారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం తొలిసారిగా ఇఫ్తార్ విందు నిర్వహించడం విశేషం. -
రెండేళ్లలో నలుగురు ప్రధానులు!
- ఆస్ట్రేలియాలో మరోసారి మారిన రాజకీయసమీకరణాలు - లిబరల్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో ఓడి పదవి కోల్పోయిన టోనీ అబాట్.. నూతన ప్రధానిగా మాల్కమ్ టర్న్‌బుల్ ప్రపంచంలోనే ధనిక దేశాల జాబితాలో టాప్ 10లో ఒకటైన ఖండదేశం ఆస్ట్రేలియాలో గడిచిన రెండేళ్లుగా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది గంటల కిందట (సోమవారం సాయంత్రం) ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ పదవి కోల్పోవడం తప్పనిసరి కావటం ఆ పరిణామాలకు పరాకాష్ట. గడిచిన రెండేళ్లలో ఆస్ట్రేలియాకు ముగ్గురు ప్రధానులు మారారు. (లేబర్ పార్టీలో నాయకత్వ మార్పుతో 2013లో జూలీ గిలార్డ్ ప్రధాని పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో కెవిన్ రూడ్ అత్యున్నత పదవిని చేపట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. లిబరల్ పార్టీ విజయం సాధించింది. టోనీ అబాట్ ప్రధానిగా ప్రమాణం చేశారు) ఇప్పుడు అబాట్ స్థానంలో గద్దెనెక్కనున్న మాల్కం టర్న్ బుల్ తో కలిపితే ఆ సంఖ్య నాలుగుకు చేరుతుంది. అబాట్ ఉన్నపళంగా ఎందుకు దిగిపోవాల్సి వచ్చిందంటే.. తాను నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో ఓడిపోయినందున అబాట్ ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి లాంటి అత్యున్నత పదవి చేపట్టే వ్యక్తే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా నాయకుడిగా ఉండాలనేది ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న రాజకీయ నియమం. లేబర్ పార్టీని ఓడించి 2013లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న లిబరల్ పార్టీకి టోనీ అబాట్ నాయకుడు. అలా ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంతోపాటు ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అబాట్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆయన నాయకత్వంపై తిరుగుబాటు మొదలైంది. అబాట్ క్యాబినెట్ లో కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేసిన మాల్కం టర్న్ బుల్... వైరి వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన లిబరల్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో 54- 44 ఓట్ల తేడాతో అబాట్ పై మాల్కం విజయం సాధించారు. దీంతో అబాట్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు.'టోనీ అబాట్ గవర్నర్ కు రాజీనామాలేఖ సమర్పించడమే ఆలస్యం.. నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తాను' అని మాల్కం టర్న్ బుల్ సోమవారం కాన్ బెర్రాలో విలేకరులతో అన్నారు. ఫైటర్.. టర్న్‌బుల్.. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి వ్యాపారవేత్తగానూ విజయం సాధించిన మాల్కం టర్న్ బుల్.. లిబరల్ పార్టీలో చేరి అనతికాలంలోనే ఉన్నతస్థాయికి ఎదిగారు. 2008-09లో ప్రతిపక్ష నేతగా లేబర్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గే వివాహ చట్టం, వాతావరణ మార్పులు తదితర అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీతో మొట్టికాయలు తిన్నారు. కమ్యూనికేషన్ల మంత్రిగా ఉంటూనే అబాట్ తీరును నిరసించారు. సమర్థ నాయకత్వం లేనిదే ఆస్ట్రేలియా మనుగడ సాధించలేదన్న వాదనతో పార్టీని మెప్పించి ప్రధాన మంత్రి పదవికి అర్హత సాధించారు. నిజానికి 2013లోనే మాల్కం ప్రధాని కావల్సింది. కానీ ఒక్క ఓటు తేడాతో టోనీ అబాట్ లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా గెలవడంతో ఛాన్స్ మిస్ అయింది.