ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వాగతం పలికారు.
ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో బంధాల బలోపేతానికి టర్న్‌బుల్ భారత ప్రధానితో చర్చలు జరుపుతారు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను భారత్ ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది.