ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం కానుంది.
నాలుగేళ్ల కిందట ఇదే ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును మూటకట్టుకుంది. అయితే ఈసారి మాత్రం అటువంటి తప్పిదాలను చేయకూడదని భారత జట్టు భావిస్తోంది.
ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందే గులాబీ బంతితో సాధన చేసేందుకు భారత్ సన్నద్ధమైంది. కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్ (పీఎం) ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్ ఆడే అవకాశముంది.
వర్షం ఆడ్డంకి..
అయితే ఈ సన్నాహక మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. స్ధానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:30(ఇండియన్ టైమ్ 9:30) గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ మ్యాచ్ జరిగే కారన్‌బెర్రాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తునే ఉంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలో టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రం స్టేడియంకు ఇప్పటికే చేరుకున్నారు.
చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment