ఉగ్రవాదాన్ని అంతంచేయాలి
ఆసిస్ ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిలీ: ప్రపంచంలో పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని, అందుకు శాంతి కాముక దేశాలన్నీ తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం సమర్థించదగినది కాదనేది భారత్ అభిమతం. దీన్ని ఏ రూపంలో ఉన్నా సమగ్రమైన కార్యాచరణతో ప్రపంచంలోని శాంతికాముక దేశాలన్నీ కలసి తుదముట్టించాలి’అన్నారు. శిలాజ ఇంధన పొదువు, కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని విస్తరించడంలో భాగంగా అణు ఇంధన శక్తిని పెంచుకొనేందుకు భారత్ అడుగులు వేస్తోందన్నారు.