మెట్రోలో మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని సెల్ఫీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మెట్రో రైలులో ప్రయాణించారు. సోమవారం సాయంత్రం మండి హౌస్ మెట్రో స్టేషన్ నుంచి అక్షరధామ్ ఆలయం వరకు ఇరు దేశాల ప్రధానులు రైలులో విహరించారు.
భారత పర్యటనకు వచ్చిన టర్న్‌బుల్‌తో కలసి ప్రధాని మోదీ తొలుత మండి హౌస్ మెట్రో స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లోని ప్రయాణికులకు వారు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మోదీ, మోదీ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. రైలులో ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్.. మోదీతో సెల్ఫీ దిగారు. మోదీ ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో కలసి ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణించామని మోదీ ట్వీట్ చేశారు. ఇద్దరూ అక్షర్ ధామ్ ఆలయాన్నిసందర్శించారు.