Australian PM
-
పార్లమెంట్ హౌజ్‌లోనే అత్యాచారం
కాన్బెరా: ఆస్ట్రేలియాలో రెండేళ్ల క్రితం ఏకంగా పార్లమెంట్ హౌజ్‌లో, స్వయంగా ఒక మహిళా మంత్రి కార్యాలయంలో ఒక ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం నాటి రక్షణ పరిశ్రమల మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో సహోద్యోగి చేతిలో అత్యాచారానికి గురయ్యానని ప్రభుత్వ మాజీ ఉద్యోగిని బ్రిటనీ హిగిన్స్ సోమవారం ఆరోపించారు. 2019లో ఈ ఘటన జరిగిందని, ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తినప్పటికీ తనకు బాస్ అయిన మంత్రి లిండా రేనాల్డ్స్ నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ న్యాయం పొందేందుకు తగిన సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే పోలీస్ కంప్లయింట్‌పై ముందుకు వెళ్లలేదని వివరించారు. లిండా రేనాల్డ్స్కు హిగిన్స్ మీడియా సలహాదారుగా పనిచేశారు. ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆ అత్యాచారంపై అధికారికంగా పోలీసులకు కంప్లయింట్ ఇవ్వలేదని తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం ఆమెకు క్షమాపణలు తెలిపారు. హిగిన్స్ ఆరోపణలపై నాటి రక్షణ మంత్రి రేనాల్డ్స్ ఆమెనే తప్పుపట్టడం సరికాదని, ఈ విషయంలో హిగిన్స్‌కు తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని మోరిసన్ వ్యాఖ్యానించారు. పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోరిసన్ మంత్రివర్గంలో ప్రస్తుతం లిండా రేనాల్డ్స్ రక్షణ మంత్రిగా ఉన్నారు. పార్లమెంట్ హౌజ్ పని సంస్కృతిలో తీసుకురావాల్సిన మార్పులపై, ఉద్యోగినుల భద్రతపై సూచనలు చేసేందుకు ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తరువాత కూడా రేనాల్డ్స్‌ను మంత్రిగా కొనసాగించడంపై విపక్షాలు మోరిసన్‌పై విమర్శలు గుప్పించాయి. -
మెట్రోలో మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని సెల్ఫీ
-
మోదీతో సెల్పీ దిగిన టర్న్‌బుల్
-
మెట్రోలో మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని సెల్ఫీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మెట్రో రైలులో ప్రయాణించారు. సోమవారం సాయంత్రం మండి హౌస్ మెట్రో స్టేషన్ నుంచి అక్షరధామ్ ఆలయం వరకు ఇరు దేశాల ప్రధానులు రైలులో విహరించారు. భారత పర్యటనకు వచ్చిన టర్న్‌బుల్‌తో కలసి ప్రధాని మోదీ తొలుత మండి హౌస్ మెట్రో స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లోని ప్రయాణికులకు వారు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మోదీ, మోదీ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. రైలులో ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్.. మోదీతో సెల్ఫీ దిగారు. మోదీ ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో కలసి ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణించామని మోదీ ట్వీట్ చేశారు. ఇద్దరూ అక్షర్ ధామ్ ఆలయాన్నిసందర్శించారు. -
ప్రధాని మోదీపై ప్రశంసలే ప్రశంసలు!
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కం టర్నబుల్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. అభివృద్ధి, ఆర్థిక వృద్ధి పథంలో దేశాన్ని ప్రశంసనీయమైన రీతిలో ప్రధాని మోదీ నడిపిస్తున్నారని కొనియాడారు. ’మన బంధం బలమైనది. ఈ పర్యటనతో మరింత బలోపేతం కానున్నది. ప్రధాని మోదీ ఈ దేశాన్ని ఎంతో అసాధారణమైనరీతిలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. భారత్ సాధించిన విజయాలు యావత్ ప్రపంచానికి ప్రశంసదాయకం. భారత్‌తో మరింత సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు. లాంఛనప్రాయమైన రాష్ట్రపతి భవన్లో విందు సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాలోని 5 లక్షలమందికి భారత నేపథ్యముంది. ఇరుదేశాలు ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి’ అని అన్నారు. తొలిసారి భారత పర్యటనకు వచ్చిన టర్నబుల్ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తన నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ముంబైలో పర్యటించి.. ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. -
దేశ ప్రధానికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన ట్రంప్!
దూషించి.. గద్దించి.. మధ్యలో కాల్ కట్ చేసిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కం టర్న్బాల్కు గట్టి షాకే ఇచ్చారు. ఇటీవల టర్న్బాల్కు ఫోన్ చేసిన ట్రంప్.. శరణార్థుల ఒప్పందం విషయంలో ఆయనపై మండిపడ్డారు. గట్టిగా దూషించి.. మందలించి.. మాట్లాడుతుండగానే మధ్యలోనే ట్రంప్ కాల్ కట్ చేసినట్టు ‘వాషింగ్టన్ పోస్టు’ ఓ కథనంలో తెలిపింది. అమెరికాకు ఆస్ట్రేలియా అత్యంత సన్నిహిత దేశం. కాబట్టి ట్రంప్-టర్న్బాల్ మధ్య సత్సంబంధాలు ఉంటాయని అందరూ భావించారు. అయితే, శరణార్థుల విషయంలో ఒబామా సర్కారుతో ఆస్ట్రేలియా చేసుకున్న ఒప్పందం విషయంలో ట్రంప్ టర్న్బాల్పై గుస్సా అయినట్టు తెలుస్తోంది. అయితే, తనను ట్రంప్ తీవ్రంగా మందలించి.. మధ్యలోనే కాల్ కట్ చేసినట్టు వచ్చిన కథనంపై కామెంట్ చేసేందుకు టర్న్బాల్ నిరాకరించారు. ఇది పూర్తిగా ప్రైవేటు సంభాషణ అని ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా తీరప్రాంతంలో ఉన్న దాదాపు 1600 మంది శరణార్థులను మార్చుకునే విషయంలో గత ఒబామా సర్కారుతో ఆస్ట్రేలియా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. శరణార్థుల రాకను నిషేధిస్తూ ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. ఈ పాత ఒప్పందాన్ని కొనసాగించేందుకు ట్రంప్ అంగీకరించారని ట్రర్న్బాల్ గత సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో టర్న్బాల్పై ట్రంప్ మండిపడినట్టు తెలుస్తోంది. -
టర్న్బుల్కే ఆసీస్ ప్రధాని పీఠం!
ఓటమిని అంగీకరించిన విపక్ష నాయకుడు మెల్బోర్న్ : ఉత్కంఠరేపిన పోరులో ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా 61 ఏళ్ల మాల్కమ్ టర్న్‌బుల్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. హోరాహోరీగా సాగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని టర్న్‌బుల్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమి విజయం సాధించింది. దీంతో 8 రోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపునకు ఆదివారంతో తెరపడింది. మొత్తం 150 సీట్లున్న పార్లమెంటులో లిబరల్-నేషనల్ కూటమి 74 స్థానాలు దక్కించుకుంది. బిల్ షార్టెన్ నాయకత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ 66 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగిలిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే లిబరల్-నేషనల్ కూటమికి 76 సీట్లు కావాలి. ఈనెల 2న ఎన్నికలు జరిగాయి. ఈ విజయం అందరి కృషి ఫలితమని టర్న్‌బుల్ చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి సహకరించి, తమను గెలిపించిన ఆస్ట్రేలియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సుస్థిర పాలనే తమకు పట్టం కట్టిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈసారి పార్లమెంటులో చాలా కొత్త ముఖాలు కనిపించనున్నాయని, వారిలో గొప్ప నాయకులెందరో ఉన్నారన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నానన్నారు. ‘భవిష్యత్ తరాలకు మేం ట్రస్టీలం. కనుక ఏం చేసినా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేయాలి’ అని ప్రధాని అన్నారు. గవర్నర్ జనరల్ విదేశీ పర్యటనలో ఉన్నందున టర్న్‌బుల్ ప్రమాణస్వీకారోత్సవానికి కనీసం వారం రోజులు పట్టేట్టుందని స్థానిక మీడి యా సమాచారం. ఫలితాల వెల్లడికి ముందే విపక్ష నాయకుడు షార్టెన్ సంచలనాత్మకంగా తన ఓటమిని అంగీకరించారు. ఆసీస్ ప్రధాని మళ్లీ టర్న్బుల్లే అని, ప్రజా సంక్షేమంలో ఆయనకు తన మద్దతు ఉంటుందన్నారు.