
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రోరైల్ వ్యవస్థలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా బహదూర్‌గఢ్–ముండ్కా మార్గాన్ని మోదీ ఆదివారం ప్రారంభించారు. పట్టణాల్లో సౌకర్యవంతమైన, అందుబాటు ధరల్లో లభించే రవాణా వ్యవస్థలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
‘మెట్రోరైళ్లకు సంబంధించి మా ప్రభుత్వం ఓ విధానం తీసుకొచ్చింది. మెట్రో వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలనీ, కొన్ని ప్రాథమిక ప్రమాణాల ప్రకారమే అవి పనిచేయాలని మేం భావిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ‘దేశంలో వివిధ నగరాల్లోని మెట్రోరైల్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు ఇతర దేశాలు మనకు సాయం చేశాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయా దేశాల్లోని మెట్రో రైళ్లకు బోగీలను మన దేశంలో తయారుచేయడం ద్వారా వారికి మనం సాయం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment