sridharan
-
సైంటిస్ట్ హత్యకు కారణం అదే: సీపీ
సాక్షి, హైదరాబాద్ : శాస్త్రవేత్త శ్రీధరన్ సురేష్ హత్య కేసు మిస్టరీని ఛేదించినట్లు నగర సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సురేష్‌తో అనైతిక సంబంధం ఏర్పరచుకున్న శ్రీనివాస్ డబ్బు కోసమే అతడిని హతమార్చినట్లు వెల్లడించారు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో సైంటిస్ట్‌గా పరిచేస్తున్న శ్రీధరన్ తన ఫ్లాట్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీపీ కేసుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. సురేష్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించకపోవడంతో భార్య ఇందిరా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. సీపీ మాట్లాడుతూ.. ‘ఈ నెల 1న అన్నపూర్ణ అపార్ట్మెంట్లోని తన గదిలో సురేష్ హత్యకు గురయ్యాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు సురేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. గదికి బయట నుంచి తాళం వేసి ఉండటంతో.. లాక్ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న సురేష్‌ను గుర్తించారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్, సురేష్ కాల్ డేటా, వేలిముద్రలను సేకరించారు’ అని తెలిపారు. ఈ ఆధారాలతో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు.. తరచుగా శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. ‘సురేష్ తరచూ బ్లడ్‌టెస్టు కోసం విజయ డయాగ్నస్టిక్స్‌కు వెళ్లేవాడు. అక్కడే లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. భార్యకు దూరంగా... ఒంటరిగా ఉంటున్న సురేష్‌తో శ్రీనివాస్ అనైతిక సంబంధం ఏర్పచుకున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల నుంచి డబ్బులు కావాలని శ్రీనివాస్ సురేష్‌ను అడుగుతూ వచ్చాడు. సురేష్ ఇందుకు స్పందించకపోవడంతో అతడిని హత్య చేయాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా సురేష్ గదికి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సురేష్‌ను హత్య చేశాడు’ అని సీపీ వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి ఒక కత్తి, రెండు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పెళ్ళైన నెలకే భార్య వదిలేసి వెళ్ళిపోయింది
అమీర్‌పేట: అమీర్‌పేట అన్నపూర్ణ అపార్ట్మెంట్లో ఉండే శాస్త్రవేత్త శ్రీధరన్ సురేష్‌ను దారుణంగా హత్య చేసి పారిపోయిన నిందితుడి పట్టుకునేందుకు ఎస్ఆర్నగర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న సురేష్‌ను శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన శ్రీనివాస్‌కు రెండు నెలల క్రితమే వివాహం కాగా నెల రోజులకే భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లి పోయినట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన నాటి నుండి శ్రీనివాస్ సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉందన్నారు. -
స్వలింగ సంపర్కమే సైంటిస్ట్ హత్యకు దారితీసిందా?
అమీర్‌పేట: శాస్త్రవేత్త శ్రీధరన్ సురేష్ హత్య కేసులో మిస్టరీ వీడలేదు. స్వలింగ సంపర్కమే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన సమయంలో సురేష్ ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఘటనా స్థలంలో ఓ ఆయిల్ బాటిల్ లభించడంతో అనుమానాలు బలపడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అమీర్‌పేటలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే శ్రీనివాస్ గత రెండు నెలలుగా తరుచూ సురేష్ ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాసే హత్య చేశాడా లేక ఇతరుల పాత్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కాగా శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అయితే సురేష్ ఫ్లాట్‌కు చివరిసారిగా వాషింగ్ మెషిన్ మెకానిక్ వచ్చినట్లు తేలడంతో అతడి పాత్రపై కూడాఆరా తీస్తున్నారు. భార్యకు మెసేజ్‌లు మాత్రమే... ఇండియన్ బ్యాంకులో పనిచేసే సురేష్ భార్య ఇందిర 2005లో బదిలీపై చెన్నై వెళ్లింది. అప్పటి నుంచి సురేష్ నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. కాగా భార్యా, భర్తల మధ్య గొడవలు ఉన్నాయని, భార్యతో అతను సరిగా మాట్లాడే వాడు కాదని, ఏదైనా అవసరముంటే సెల్‌కు మెసేజ్‌లు మాత్రమే చేసేవాడని తెలిసింది. భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు హత్యకు దారి తీశాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నువ్వు మాస్‌రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
మెట్రోలో ప్రమాణాలకు కమిటీ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రోరైల్ వ్యవస్థలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా బహదూర్గఢ్–ముండ్కా మార్గాన్ని మోదీ ఆదివారం ప్రారంభించారు. పట్టణాల్లో సౌకర్యవంతమైన, అందుబాటు ధరల్లో లభించే రవాణా వ్యవస్థలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘మెట్రోరైళ్లకు సంబంధించి మా ప్రభుత్వం ఓ విధానం తీసుకొచ్చింది. మెట్రో వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలనీ, కొన్ని ప్రాథమిక ప్రమాణాల ప్రకారమే అవి పనిచేయాలని మేం భావిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ‘దేశంలో వివిధ నగరాల్లోని మెట్రోరైల్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు ఇతర దేశాలు మనకు సాయం చేశాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయా దేశాల్లోని మెట్రో రైళ్లకు బోగీలను మన దేశంలో తయారుచేయడం ద్వారా వారికి మనం సాయం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. -
విజయవాడ, విశాఖ మెట్రోలకు ప్లాన్ రెడీ
విజయవాడ: విజయవాడ మెట్రో రైల్వే లైన్‌కు 6769 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో 26.03 కిలో మీటర్ల మేర మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం మెట్రో ప్లాన్లను మెట్రో చైర్మన్ శ్రీధరన్.. చంద్రబాబుకు అందజేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఈ నివేదికలను చంద్రబాబుకు సమర్పించారు. విజయవాడ బస్టాండ్ నుంచి పెనుమలూరు, నిడమానూరు వరకు రెండు కారిడార్లు నిర్మించనున్నారు. విశాఖ మెట్రో కారిడార్‌ను 45.5 కిలో మీటర్ల మేర చేపట్టనున్నట్టు చంద్రబాబు చెప్పారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ, విజయవాడకు డీఎంఆర్సీ నివేదికపై చంద్రబాబుతో చర్చించినట్టు వెంకయ్య నాయుడు చెప్పారు. -
చంద్రబాబుతో మెట్రో శ్రీధరన్ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడితో ఆ రాష్ట్ర మెట్రో రైలు సలహాదారుడు శ్రీధరన్ శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ డిజైన్ మార్పుపై ఈ సందర్భంగా వారు చర్చించారు. అయితే మెట్రో రైలు నిర్మించేందుకు అవసరమైనంత జనాభా విజయవాడ నగరంలో లేరని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్నికి వెల్లడించింది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టుకు సహకరించలేమని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణానికి పలు సవరణలు చేసి... కేంద్రానికి పంపనుంది. ఈ నేపథ్యంలో బాబు, శ్రీధరన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
జూన్ నుంచి ‘మెట్రో’ పనులు
-
జూన్ నుంచి ‘మెట్రో’ పనులు
* విజయవాడ మెట్రో రైలు వ్యయం రూ.6,823 కోట్లు * సీఎం చంద్రబాబుకు డీపీఆర్‌ను అందజేసిన శ్రీధరన్ * కిలోమీటరుకు రూ.209 కోట్లు * రెండు కారిడార్లు.. 26.03 కిలోమీటర్ల పొడవు * చార్జీలు 5 కి.మీ.కు రూ.10.. పది కి.మీ.కు రూ.20..ఆ పైన రూ.30 * విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి రూటులో * మెట్రో రైలు లాభసాటి కాదని స్పష్టీకరణ విజయవాడ మెట్రో రైలు నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.6,823 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) ముఖ్య సలహాదారు శ్రీధరన్ ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడును కలసి విజయవాడ మెట్రో రైలు మొదటి దశకు సంబంధించి డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. శ్రీధరన్ సమర్పించిన డీపీఆర్ ప్రకారం.. కిలోమీటరు మెట్రో రైలు నిర్మాణానికి రూ.209 కోట్లు ఖర్చు కానుంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి రెండు కారిడార్లుగా మెట్రో రైలు నిర్మాణాన్ని రూపొందించారు. కారిడార్-1గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి పెనమలూరు(12.76 కి.మీ.), కారిడార్-2గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి నిడమానూరు వరకు (13.27 కి.మీ.) మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నట్లు శ్రీధరన్ వివరించారు. రెండు కారిడార్లు కలిపి మొత్తం 26.03 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపారు. కారిడార్-1, 2లలో రాజధాని ప్రాంతం అమరావతి, గన్నవరం ఎయిర్‌పోర్టు, ఇంద్రకీలాద్రి(గొల్లపూడి)కి మెట్రో రైలు కనెక్టివిటీ ప్రతిపాదనలు రూపొందించారు. - సాక్షి, హైదరాబాద్ జూన్ నుంచి మొదటి దశ పనులు.. జూన్ నుంచి మెట్రో ప్రాజెక్టు మొదటిదశ పనుల్ని ప్రారంభిస్తామని శ్రీధరన్ తెలిపారు. 2019 జనవరి 1 కల్లా ఓ దశను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాగా 2019-20 నాటికి ట్రాఫిక్ డిమాండ్ 2.91 లక్షల ట్రిప్‌లు అయితే, 2051-52 నాటికి 9.99 లక్షల ట్రిప్‌లకు చేరుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సభ్యులు స్పష్టం చేశారు. రాజధాని అవసరాలదృష్ట్యా మెట్రో రైల్ ట్రాఫిక్ భారీగా పెరుగుతుందన్న ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. విశాఖ మెట్రో రైలు డీపీఆర్ జూన్ 15కల్లా సిద్ధమవుతుందని శ్రీధరన్ తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖ నుంచి అమరావతి మీదుగా తిరుపతి, అలాగే బెంగళూరు నుంచి అమరావతికి హై స్పీడ్ ట్రెయిన్ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు వివరించారు. వచ్చే కేబినెట్ భేటీలో ఈ ప్రాజెక్టుల గురించి చర్చిస్తామన్నారు. డీపీఆర్‌లోని ప్రధానాంశాలివీ.. * మెట్రో రైలు ప్రాజెక్టును రూ.5,705 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని, నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే నిర్మాణం పూర్తయ్యేనాటికి రూ.6,823 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. * కారిడార్-1ను కృష్ణానది రైల్వే బ్రిడ్జికి 200 మీటర్ల దిగువకు పొడిగించి అక్కడినుంచి కుడివైపుగా తుళ్లూరు ప్రాంతానికి కలిపేలా ప్రతిపాదించారు. * మెట్రో రైలులో మూడు బోగీలుంటాయి. గంటకు 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికుల్ని చేరవేస్తాయి. * రాజధానిని అభివృద్ధి చేసేదశలో భూగర్భ మెట్రో రైలు నిర్మాణం చేపడితే కిలోమీటరుకు రూ.500-600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. * మెట్రో రైలు చార్జీలను ఐదు కిలోమీటర్లకు రూ.10, పది కిలోమీటర్లకు రూ.20, ఆ పైన అయితే రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. * మెట్రో రైలు ప్రాజెక్టుకు మొత్తం 31.029 హెక్టార్లు ప్రైవేటు, ప్రభుత్వ భూములు అవసరమని డీపీఆర్‌లో పేర్కొన్నారు. అలాగే మెట్రో రైలు డిపోకు 11.34 హెక్టార్ల భూమి అవసరమన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుకోసం ప్రభుత్వ భూములను రిజర్వ్ చేయనున్నట్లు సర్కారు స్పష్టం చేసింది. * రెండు కారిడార్లలో ప్రభుత్వ భూమిని ప్రాపర్టీ డెవలప్మెంట్తో ప్రాజెక్టుకు నిధుల సమీకరణకోసం ఉపయోగిస్తారు. భూసేకరణకు డీఎంఆర్సీ రూపకల్పన చేస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో డీఎంఆర్సీ 6 శాతం వసూలు చేస్తుంది. ల్యాండ్, ఎస్టాబ్లిష్మెంటు చార్జీలు కలపకుండా ఇది రూ.320 కోట్లు కావచ్చని అంచనా. * ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) తరహాలోనే తాజా ప్రాజెక్టును నిర్మిస్తారు. ఏపీ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వంతోపాటు నిర్మాణంలో పాలుపంచుకునేందుకు మరో కొత్త నిర్మాణ కంపెనీ ఏర్పాటవుతుంది. భూసేకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించనుంది. మెట్రో రైలు నిర్మాణ వ్యయాన్ని జైకా లాంటి సంస్థలద్వారా రుణం రూపేణా సేకరిస్తారు. ఏడేళ్లలో పెట్టుబడి తిరిగి వచ్చేలా చార్జీలను నిర్ణయించారు. * విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి రూటుకు మెట్రో రైలు లాభసాటి కాదని డీఎంఆర్సీ పేర్కొంది. ఇందుకు ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టంను ప్రతిపాదించింది. -
సీఎం చేతికి 'విజయవాడ మెట్రో' నివేదిక
విజయవాడ నగరంలో ప్రతిపాదిత మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్టీఎస్ ) ప్రాజెక్టు నివేదిక ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఏపీ మెట్రో ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు శ్రీధరన్.. రిపోర్టును ఆదివారం సీఎంకు అందించారు. భూకంపం నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో మెట్రో రైలు నిర్మాణం, తదితర అంశాలపై వెంకయ్య, శ్రీధరన్‌తో చంద్రబాబు చర్చించారు. ఏపీలో నిర్మించబోయే మెట్రో రైలు కిలో మీటరుకు రూ. 304 కోట్లు ఖర్చవుతాయని అంచనా. తదుపరి క్యాబినెట్ భేటీలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విజయవాడతోపాటు విశాఖపట్నం నగరంలోనూ మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ ‘పురా వైభవం’ ఇతర నదులకు వద్దా?
ఒక్క ‘పవిత్ర’ నదిని ప్రక్షాళన చేసినంతమాత్రాన యావద్దేశం శుద్ధి అయిపోతుందా? అది అసాధ్యం. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు పురాణ ప్రాధాన్యత మిషతో ఈ నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు? గంగానది శుద్ధి కార్య క్రమం గడచిన 30 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి నేటి వరకు దాదాపు రూ. 2 వేల కోట్లను ఖర్చు పెట్టారు. భారత సర్వో న్నత న్యాయస్థానం కొన్ని వారాల క్రితం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మంద లించింది. గంగానది శుద్ధి కార్యక్రమాన్ని మీరు ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయదల్చుకున్నారా లేక వచ్చే అయిదేళ్లకు కూడా దీన్ని కొనసాగించాల నుకుం టున్నారా తేల్చి చెప్పమంటూ సుప్రీంకోర్టు నిగ్గ దీసింది. మీ కార్యాచరణ పథకం చూశాక గంగా నది వచ్చే 200 సంవత్సరాల్లో కూడా పరిశుద్ధం కాదనిపిస్తోందన్నది కోర్టు వ్యాఖ్య. గంగానది తన పురాతన వైభవాన్ని తిరిగి పొందేలా, భవిష్యత్ తరాలు దాన్ని దర్శించగలిగేలా మీరు తగిన చర్యలు చేపట్టాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. కోర్టు వ్యాఖ్యకు స్పందించిన కేంద్రం గంగా నది ప్రక్షాళన కార్యక్రమం 2018 నాటికి పూర్తవుతుందని తెలిపింది. అంటే నరేంద్ర మోదీ ప్రస్తుత పదవీ కాలం లోనే ఇది పూర్తవుతుందని దీనర్థం. గంగానది పొడవునా ఉన్న 118 కాలుష్య పట్టణాలను ఇప్పటికే గుర్తించామని, వాటి పురపాలక సంస్థలను మేలుకో వలసిందిగా ఆదేశించామని కేంద్రం వివరించింది. గంగ ప్రక్షాళనకు మరొక శ్రీధరన్ కోసం సుప్రీం కోర్టు అన్వేషిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పతాక శీర్షికలో పేర్కొంది. దేశంలో వివిధ క్లిష్టతరమైన రైల్వే ప్రాజెక్టులను నిర్మించిన శ్రీధరన్ విశ్రాంత ఉన్నతాధికారి. గంగ ప్రక్షాళన పథకంలో వ్యవస్థా గత లోపాలున్నాయని, ఈ పథకాన్ని అమలు చేస్తు న్న ఉన్నత స్థాయి వ్యక్తులను మార్చాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతున్నట్లు ఆ వార్త పేర్కొంది. గంగానది ప్రక్షాళన పథకాన్ని సుప్రీంకోర్టు చాలా కాలంగా ముందుకు నెడుతూ వస్తోంది. ఈ ప్రక్షాళన కోసం పనిచేస్తున్న అన్ని ప్లాంట్ల స్థితిపై, అవి ఎప్పుడు పని మొదలెడతాయన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదే శించింది. ఈ అంశంపై ఉన్నతాధికారుల పరిభా షలో కాకుండా, దాన్ని నిరూపించదగిన పదజా లంతో నిర్దిష్టకాల కార్యాచరణను సమర్పించాలని కోరింది. ‘గంగానది ప్రక్షాళన పట్ల మీరు ఎంతో నిబద్ధ తను ప్రకటించారు. ఈ విషయంపై మాకంటే మీరే మరింత బాధ్యతతో ఉండాల’ని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. నా ప్రశ్న ఒక్కటే: అలా ఎందు కుండాలి? ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ ఒక్క నది ప్రక్షాళనపై మాత్రమే ఎందుకు నొక్కి చెబుతున్నారు? గంగాన దిని ప్రక్షాళన చేస్తే భారతదేశం మొత్తంగా శుద్ధి అయిపోతుందా? లేదు. అది సాధ్యం కాదు. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు కేవలం ఒక్క నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇంత ప్రభుత్వ యంత్రాంగ సమయాన్ని ఎందుకు వెచ్చిస్తున్నారు? పలువురు హిందువులు ఈ నదిని పవిత్రమై నదిగా భావిస్తున్నారన్న వాస్తవంతో సుప్రీంకోర్టు ప్రభావితం కాలేదా? ఇలాంటి వాగ్దానాలతో మోదీ ప్రభుత్వం హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తుం డవచ్చు కానీ, అది రాజకీయం. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లను తిరస్కరించడం వంటి చర్యల్లోనూ ప్రభుత్వ వైఖరి ప్రతిఫలిస్తోంది. (వెను కబడిన ముస్లింలు వెనుకబడిన హిందువుల మాదిరే నిరుపేదలు. కాని వారి పూర్వీకులు మరొక దేవుడిని ప్రార్థించడాన్ని ఎంచుకున్నందున ప్రత్యేకించి ఈ తరగతి ముస్లింలను శిక్షిస్తున్నారు. ఎద్దులను చంప డంపై నిషేధం విధించడంలో కూడా ప్రభుత్వం వైఖరిలో సత్వర స్పందన కనిపిస్తుంది. భారతీయ జనతాపార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి చర్యలనే ఊహిస్తారు. వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నాకు ఎలాంటి సమస్య ఎదురుకాదు కూడా. నా సమస్య ఏమిటంటే.. సుప్రీంకోర్టు గంగా నది ప్రక్షాళనలో ఎందుకిలా జోక్యం చేసుకుంటోం ది? మతపరమైన మనోభావాలు, కల్పనలు కోర్టు ప్రాధాన్యతలను ఎందుకు నిర్దేశిస్తున్నాయి? పైగా, ఒక గుజరాతీయుడిగా మరో విషయం కూడా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అదేంటంటే, ‘తపి’ నది ప్రక్షాళనపై ఎందుకు దృష్టి సారించడం లేదు? చాలా మంది సూరత్ వాసులను ఈ నది భయపెడు తుంటుంది. మా అమ్మ నర్మదానదికి విశేష ప్రాధా న్యతను ఇస్తుంది. హిందువులను బుజ్జగించడానికి నర్మదానది ప్రక్షాళనను ఎందుకు చేపట్టరు? దక్షిణభారత్‌లో నివసిస్తున్న వాడిగా కృష్ణా, కావేరీ నదులపై భారీగా ఖర్చుపెట్టి, మానవ శక్తిని వెచ్చించడానికి నేనిష్టపడతాను. ఈ రెండు నదుల ప్రక్షాళనను ఎందుకు చేపట్టలేదు? బ్రహ్మపుత్రానది లేదా బహుశా గంగానది కంటే ఎక్కువగా మురికి మయమైపోయిన యమునా నదిని ఎందుకు ప్రక్షా ళన చేయరు? భవిష్యత్ తరాల ప్రజలు వీటిని తమ పురాతన వైభవంలో (దానర్థం ఏదైనా కావచ్చు) భాగంగా ఎందుకు చూడకూడదు? గంగానదీ పరీవాహక ప్రాంతం పొడవునా నెల కొన్న 113 పట్టణాలలో పేరుకుపోతున్న చెత్తలో మూడింట రెండొంతులకు పైగా, దేశంలోని జాతీ య నదుల్లోకి చేరిపోతోంది. ఈ కోణంలో గంగానది ప్రక్షాళనకు సుదీర్ఘ ప్రక్రియ అవసరం తప్పకపోవ చ్చని ఒక నివేదిక తెలిపింది. పలు ప్రభుత్వ సంస్థల నుంచి నిపుణుల బృందం సిద్ధం చేసిన మరొక నివేదిక మరింత దారుణమైన వివరాలను బయట పెట్టింది. ఈ అన్ని పట్టణాలు 363.6 కోట్ల లీటర్ల మురికినీటిని ప్రతిరోజూ సృష్టిస్తున్నాయని, అయితే ఐదు రాష్ట్రాల పరిధిలో నెలకొన్న ఈ పట్టణాల్లోని మురికినీటి శుద్ధి కర్మాగారాలు కేవలం 102.7 కోట్ల లీటర్ల నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అంటే గంగానదిని ప్రక్షాళన చేయడమంటే ఈ నగరాలన్నింటినీ ప్రక్షాళన చేయడమని అర్థం. ఈ పట్టణాల్లో నివసిస్తున్న పౌరులకు సమర్థవంతమైన మురికినీటి నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను కల్పించాలి. ఇలా చేస్తే నిజంగా బాగుంటుంది. అదే సమయంలో దేశంలోని ఇతర పట్టణాల మాటేంటి? పవిత్రమైన నదిని కాలుష్యం చేయగలగిన స్థితిలో అవి లేవు కాబట్టి వాటిని సవతి పుత్రుల్లాగే కేంద్రం తీసిపారేయవలసిందేనా? పురాణాల్లో దానికున్న ప్రాధాన్యత రీత్యా గం గానదిని ప్రత్యేక దృష్టితో చూడాలన్న సుప్రీంకోర్టు భావనను, హిందూయేతర, హిందూమతేతర భార తీయులు ఎలా అర్థం చేసుకుంటారన్నది హిందు వుగా నాకు అందోళన కలిగిస్తోంది. అంతకుమించి, దాని ప్రత్యేకత దృష్ట్యా గంగానదిపైనే దృష్టి సారిం చాలన్న భావనను మన మీడియా కూడా పెద్దగా ప్రశ్నించడం, ప్రతిఘటించడం లేదన్న వాస్తవం నన్ను మరింతగా కలవరపెడుతుంటుంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్: aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
ఏపీ రాజధానికి మెట్రో రైలు మార్గం
*విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసిన శ్రీధరన్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతానికి మెట్రో రైలు సౌకర్యం కల్పించేలా డిజైన్‌ను రూపొందించాలని ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ నిర్ణయించారు. విజయవాడలో మెట్రో ప్రతిపాదిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. విజయవాడలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు మెట్రో రైలు మార్గంతో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మించేలా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో మార్పులు చేయాలని అధికారులను అదేశించారు. మార్చి నాటికి విజయవాడ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా కసరత్తు చేయాలన్నారు. -
ఏపీ రాష్ట్ర సేవల్లో మెట్రో గురు
-
నగర మెట్రో భేష్
మెట్రో రైలు టెస్ట్ రన్లో శ్రీధరన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర మెట్రో ప్రాజెక్టు మెట్రోగురు శ్రీధరన్ మెప్పు పొందింది. పనుల నాణ్యత, ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయని ప్రశంసించారు. సోమవారం ఢిల్లీ మెట్రో రైలు మాజీ ఎం.డి. ఇ.శ్రీధరన్ నాగోల్ మెట్రో డిపో నుంచి సర్వే ఆఫ్ ఇండియా వరకు నిర్వహించిన మెట్రో రైలు టెస్ట్న్ల్రో పాల్గొన్నారు. మెట్రో రైళ్ల పనితీరును పరిశీలించారు. నాణ్యత, ప్రమాణాలు బాగా ఉన్నాయన్నారు. ప్రయాణం సౌకర్యవంతం, విలాసవంతంగా ఉందని కొనియాడారు. నాగోల్ స్టేషన్, ఉప్పల్ మెట్రో డిపోలోని వసతులపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని హెచ్ఎంఆర్, ఎల్ అండ్ టీ అధికారులకు సూచించారు. ఒకే పిల్లర్‌పై విభిన్న రూపాల్లో నిర్మిస్తున్న మెట్రో స్టేషన్ డిజైన్లను శ్రీధరన్ ఆసక్తిగా పరిశీలించారు. వయాడక్ట్ నిర్మాణాలను ఆసక్తిగా పరిశీలించారు. పనులు వేగవంతం అయ్యేందుకు ఈ టెక్నాలజీ దోహదం చేస్తుందన్నారు. నగర మెట్రో ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విలువైన సూచనలు, సలహాలు అందించాలని హెచ్ఎంఆర్ ఎం.డి. ఎన్వీఎస్రెడ్డి శ్రీధరన్‌ను కోరగా సానుకూలంగా స్పందించారు. విశాఖ, వీజీటీఎంలలోనూ మెట్రో పరుగులు విశాఖపట్నంలోను, విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం) పరిధిలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టులను మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలోని కార్యాలయంలో చంద్రబాబుతో ఢిల్లీ మెట్రో రైల్ రూపకర్త, డీఎంఆర్సీ మాజీ ఎండీ ఇ. శ్రీధరన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులకు సలహాదారుగా ఉండాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. తిరుపతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని శ్రీధరన్‌ను కోరారు.