
సీఎం చేతికి 'విజయవాడ మెట్రో' నివేదిక
విజయవాడ నగరంలో ప్రతిపాదిత మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్టీఎస్ ) ప్రాజెక్టు నివేదిక ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఏపీ మెట్రో ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు శ్రీధరన్.. రిపోర్టును ఆదివారం సీఎంకు అందించారు.
భూకంపం నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో మెట్రో రైలు నిర్మాణం, తదితర అంశాలపై వెంకయ్య, శ్రీధరన్తో చంద్రబాబు చర్చించారు. ఏపీలో నిర్మించబోయే మెట్రో రైలు కిలో మీటరుకు రూ. 304 కోట్లు ఖర్చవుతాయని అంచనా. తదుపరి క్యాబినెట్ భేటీలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విజయవాడతోపాటు విశాఖపట్నం నగరంలోనూ మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.