హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడితో ఆ రాష్ట్ర మెట్రో రైలు సలహాదారుడు శ్రీధరన్ శుక్రవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ డిజైన్ మార్పుపై ఈ సందర్భంగా వారు చర్చించారు. అయితే మెట్రో రైలు నిర్మించేందుకు అవసరమైనంత జనాభా విజయవాడ నగరంలో లేరని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్నికి వెల్లడించింది.
దీంతో మెట్రో రైలు ప్రాజెక్టుకు సహకరించలేమని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణానికి పలు సవరణలు చేసి... కేంద్రానికి పంపనుంది. ఈ నేపథ్యంలో బాబు, శ్రీధరన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.