విజయవాడ, విశాఖ మెట్రోలకు ప్లాన్ రెడీ
విజయవాడ: విజయవాడ మెట్రో రైల్వే లైన్కు 6769 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో 26.03 కిలో మీటర్ల మేర మెట్రో కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అమరావతి, విశాఖపట్నం మెట్రో ప్లాన్లను మెట్రో చైర్మన్ శ్రీధరన్.. చంద్రబాబుకు అందజేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఈ నివేదికలను చంద్రబాబుకు సమర్పించారు. విజయవాడ బస్టాండ్ నుంచి పెనుమలూరు, నిడమానూరు వరకు రెండు కారిడార్లు నిర్మించనున్నారు. విశాఖ మెట్రో కారిడార్ను 45.5 కిలో మీటర్ల మేర చేపట్టనున్నట్టు చంద్రబాబు చెప్పారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ, విజయవాడకు డీఎంఆర్సీ నివేదికపై చంద్రబాబుతో చర్చించినట్టు వెంకయ్య నాయుడు చెప్పారు.