ఆ ‘పురా వైభవం’ ఇతర నదులకు వద్దా? | will not need for all river for this cleaning program ? | Sakshi
Sakshi News home page

ఆ ‘పురా వైభవం’ ఇతర నదులకు వద్దా?

Published Sun, Mar 15 2015 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

ఆ ‘పురా వైభవం’ ఇతర నదులకు వద్దా?

ఆ ‘పురా వైభవం’ ఇతర నదులకు వద్దా?

ఒక్క ‘పవిత్ర’ నదిని ప్రక్షాళన చేసినంతమాత్రాన యావద్దేశం శుద్ధి అయిపోతుందా? అది అసాధ్యం. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు పురాణ ప్రాధాన్యత మిషతో ఈ నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు?
 
 గంగానది శుద్ధి కార్య క్రమం గడచిన 30 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి నేటి వరకు దాదాపు రూ. 2 వేల కోట్లను ఖర్చు పెట్టారు. భారత సర్వో న్నత న్యాయస్థానం కొన్ని వారాల క్రితం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మంద లించింది. గంగానది శుద్ధి కార్యక్రమాన్ని మీరు ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయదల్చుకున్నారా లేక వచ్చే అయిదేళ్లకు కూడా దీన్ని కొనసాగించాల నుకుం టున్నారా తేల్చి చెప్పమంటూ సుప్రీంకోర్టు నిగ్గ దీసింది. మీ కార్యాచరణ పథకం చూశాక గంగా నది వచ్చే 200 సంవత్సరాల్లో కూడా పరిశుద్ధం కాదనిపిస్తోందన్నది కోర్టు వ్యాఖ్య. గంగానది తన పురాతన వైభవాన్ని తిరిగి పొందేలా, భవిష్యత్ తరాలు దాన్ని దర్శించగలిగేలా మీరు తగిన చర్యలు చేపట్టాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్డీటీవీ పేర్కొంది.
 
 కోర్టు వ్యాఖ్యకు స్పందించిన కేంద్రం గంగా నది ప్రక్షాళన కార్యక్రమం 2018 నాటికి పూర్తవుతుందని తెలిపింది. అంటే నరేంద్ర మోదీ ప్రస్తుత పదవీ కాలం లోనే ఇది పూర్తవుతుందని దీనర్థం. గంగానది పొడవునా ఉన్న 118 కాలుష్య పట్టణాలను ఇప్పటికే గుర్తించామని, వాటి పురపాలక సంస్థలను మేలుకో వలసిందిగా ఆదేశించామని కేంద్రం వివరించింది. గంగ ప్రక్షాళనకు మరొక శ్రీధరన్ కోసం సుప్రీం కోర్టు అన్వేషిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పతాక శీర్షికలో పేర్కొంది. దేశంలో వివిధ క్లిష్టతరమైన రైల్వే ప్రాజెక్టులను నిర్మించిన శ్రీధరన్ విశ్రాంత ఉన్నతాధికారి. గంగ ప్రక్షాళన పథకంలో వ్యవస్థా గత లోపాలున్నాయని, ఈ పథకాన్ని అమలు చేస్తు న్న ఉన్నత స్థాయి వ్యక్తులను మార్చాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతున్నట్లు ఆ వార్త పేర్కొంది.
 
 గంగానది ప్రక్షాళన పథకాన్ని సుప్రీంకోర్టు చాలా కాలంగా ముందుకు నెడుతూ వస్తోంది. ఈ ప్రక్షాళన కోసం పనిచేస్తున్న అన్ని ప్లాంట్‌ల స్థితిపై, అవి ఎప్పుడు పని మొదలెడతాయన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదే శించింది. ఈ అంశంపై ఉన్నతాధికారుల పరిభా షలో కాకుండా, దాన్ని నిరూపించదగిన పదజా లంతో నిర్దిష్టకాల కార్యాచరణను సమర్పించాలని కోరింది. ‘గంగానది ప్రక్షాళన పట్ల మీరు ఎంతో నిబద్ధ తను ప్రకటించారు. ఈ విషయంపై మాకంటే మీరే మరింత బాధ్యతతో ఉండాల’ని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. నా ప్రశ్న ఒక్కటే: అలా ఎందు కుండాలి?
 
 ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ ఒక్క నది ప్రక్షాళనపై మాత్రమే ఎందుకు నొక్కి చెబుతున్నారు? గంగాన దిని ప్రక్షాళన చేస్తే భారతదేశం మొత్తంగా శుద్ధి అయిపోతుందా? లేదు. అది సాధ్యం కాదు. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు కేవలం ఒక్క నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇంత ప్రభుత్వ యంత్రాంగ సమయాన్ని ఎందుకు వెచ్చిస్తున్నారు?
 
 పలువురు హిందువులు ఈ నదిని పవిత్రమై నదిగా భావిస్తున్నారన్న వాస్తవంతో సుప్రీంకోర్టు ప్రభావితం కాలేదా? ఇలాంటి వాగ్దానాలతో మోదీ ప్రభుత్వం హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తుం డవచ్చు కానీ, అది రాజకీయం. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లను తిరస్కరించడం వంటి చర్యల్లోనూ ప్రభుత్వ వైఖరి ప్రతిఫలిస్తోంది. (వెను కబడిన ముస్లింలు వెనుకబడిన హిందువుల మాదిరే నిరుపేదలు. కాని వారి పూర్వీకులు మరొక దేవుడిని ప్రార్థించడాన్ని ఎంచుకున్నందున ప్రత్యేకించి ఈ తరగతి ముస్లింలను శిక్షిస్తున్నారు. ఎద్దులను చంప డంపై నిషేధం విధించడంలో కూడా ప్రభుత్వం వైఖరిలో సత్వర స్పందన కనిపిస్తుంది. భారతీయ జనతాపార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి చర్యలనే ఊహిస్తారు. వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నాకు ఎలాంటి సమస్య ఎదురుకాదు కూడా.
 
 నా సమస్య ఏమిటంటే.. సుప్రీంకోర్టు గంగా నది ప్రక్షాళనలో ఎందుకిలా జోక్యం చేసుకుంటోం ది? మతపరమైన మనోభావాలు, కల్పనలు కోర్టు ప్రాధాన్యతలను ఎందుకు నిర్దేశిస్తున్నాయి? పైగా, ఒక గుజరాతీయుడిగా మరో విషయం కూడా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అదేంటంటే, ‘తపి’ నది ప్రక్షాళనపై ఎందుకు దృష్టి సారించడం లేదు? చాలా మంది సూరత్ వాసులను ఈ నది భయపెడు తుంటుంది. మా అమ్మ నర్మదానదికి విశేష ప్రాధా న్యతను ఇస్తుంది. హిందువులను బుజ్జగించడానికి నర్మదానది ప్రక్షాళనను ఎందుకు చేపట్టరు?
 దక్షిణభారత్‌లో నివసిస్తున్న వాడిగా కృష్ణా, కావేరీ నదులపై భారీగా ఖర్చుపెట్టి, మానవ శక్తిని వెచ్చించడానికి నేనిష్టపడతాను. ఈ రెండు నదుల ప్రక్షాళనను ఎందుకు చేపట్టలేదు? బ్రహ్మపుత్రానది లేదా బహుశా గంగానది కంటే ఎక్కువగా మురికి మయమైపోయిన యమునా నదిని ఎందుకు ప్రక్షా ళన చేయరు? భవిష్యత్ తరాల ప్రజలు వీటిని తమ పురాతన వైభవంలో (దానర్థం ఏదైనా కావచ్చు) భాగంగా ఎందుకు చూడకూడదు?
 
 గంగానదీ పరీవాహక ప్రాంతం పొడవునా నెల కొన్న 113 పట్టణాలలో పేరుకుపోతున్న చెత్తలో మూడింట రెండొంతులకు పైగా, దేశంలోని జాతీ య నదుల్లోకి చేరిపోతోంది. ఈ కోణంలో గంగానది ప్రక్షాళనకు సుదీర్ఘ ప్రక్రియ అవసరం తప్పకపోవ చ్చని ఒక నివేదిక తెలిపింది. పలు ప్రభుత్వ సంస్థల నుంచి నిపుణుల బృందం సిద్ధం చేసిన మరొక నివేదిక మరింత దారుణమైన వివరాలను బయట పెట్టింది. ఈ అన్ని పట్టణాలు 363.6 కోట్ల లీటర్ల మురికినీటిని ప్రతిరోజూ సృష్టిస్తున్నాయని, అయితే ఐదు రాష్ట్రాల పరిధిలో నెలకొన్న ఈ పట్టణాల్లోని మురికినీటి శుద్ధి కర్మాగారాలు కేవలం 102.7 కోట్ల లీటర్ల నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.
 
 అంటే గంగానదిని ప్రక్షాళన చేయడమంటే ఈ నగరాలన్నింటినీ ప్రక్షాళన చేయడమని అర్థం. ఈ పట్టణాల్లో నివసిస్తున్న పౌరులకు సమర్థవంతమైన మురికినీటి నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను కల్పించాలి. ఇలా చేస్తే నిజంగా బాగుంటుంది. అదే సమయంలో దేశంలోని ఇతర పట్టణాల మాటేంటి? పవిత్రమైన నదిని కాలుష్యం చేయగలగిన స్థితిలో అవి లేవు కాబట్టి వాటిని సవతి పుత్రుల్లాగే కేంద్రం తీసిపారేయవలసిందేనా?
 
 పురాణాల్లో దానికున్న ప్రాధాన్యత రీత్యా గం గానదిని ప్రత్యేక దృష్టితో చూడాలన్న సుప్రీంకోర్టు భావనను, హిందూయేతర, హిందూమతేతర భార తీయులు ఎలా అర్థం చేసుకుంటారన్నది హిందు వుగా నాకు అందోళన కలిగిస్తోంది. అంతకుమించి, దాని ప్రత్యేకత దృష్ట్యా గంగానదిపైనే దృష్టి సారిం చాలన్న భావనను మన మీడియా కూడా పెద్దగా ప్రశ్నించడం, ప్రతిఘటించడం లేదన్న వాస్తవం నన్ను మరింతగా కలవరపెడుతుంటుంది.
 (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
 ఈమెయిల్: aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement