*విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసిన శ్రీధరన్
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతానికి మెట్రో రైలు సౌకర్యం కల్పించేలా డిజైన్‌ను రూపొందించాలని ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ నిర్ణయించారు. విజయవాడలో మెట్రో ప్రతిపాదిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. విజయవాడలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు మెట్రో రైలు మార్గంతో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మించేలా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో మార్పులు చేయాలని అధికారులను అదేశించారు. మార్చి నాటికి విజయవాడ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా కసరత్తు చేయాలన్నారు.