
మృతుడు శ్రీధరణ్ సురేష్ (ఫైల్ ఫోటో)
అమీర్‌పేట: అమీర్‌పేట అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో ఉండే శాస్త్రవేత్త శ్రీధరన్ సురేష్‌ను దారుణంగా హత్య చేసి పారిపోయిన నిందితుడి పట్టుకునేందుకు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న సురేష్‌ను శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన శ్రీనివాస్‌కు రెండు నెలల క్రితమే వివాహం కాగా నెల రోజులకే భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లి పోయినట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన నాటి నుండి శ్రీనివాస్ సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment