ఏలూరు అర్బన్: చింతలపూడి మండలం తీగలవంచ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని చింతలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధంపై అనుమానంతోనే హత్యచేసినట్టు నిర్ధారించారు. ఏలూరు ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. గతనెల 20న చింతలపూడి మండలం తీగలవంచ గ్రామానికి సమీపంలోని బంధంచర్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారని టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌లో మృతుల్లో ఒకరైన బైగాని మంగమ్మ భర్త సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు.
హంతకులు తన భార్య మంగమ్మతో పాటు మరదలు పూలదాసు సీతామహాలక్ష్మిని హతమార్చి వారి మెడల్లోని బంగారు నగలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో చింతలపూడి సీఐ పి.రాజేష్, టి.నరసాపురం, చింతలపూడి ఎస్సైలు ఎన్.నా గేంద్రప్రసాద్, సైదానాయక్ దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యలకు సంబంధించి ఎలాంటి కారణాలు తెలియకపోవడం, అసలు హంతకులెవరై ఉంటారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఫిర్యాదుదా రుడే హంతకుడిగా నిర్ధారించుకుని బైగాని సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారించారు.
భార్యపై అనుమానంతో ఆమెను చంపానని, దీనిని చూసిన మరదలు సీతామహాలక్ష్మిని కూడా హతమార్చినట్టు చెప్పాడని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం నిందితుడు పుట్రేవు గ్రామంలోని జీడిమామిడి తోటలో దాచిన జంట హత్యలకు ఉపయోగించిన ఆయుధం, నగలు, హత్యా స మయంలో ధరించిన దుస్తులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు.
పట్టుబడిందిలా..
సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నగల కోసమే హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావించి ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. అయినా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. ఫిర్యాదుదారుడు సత్యనారాయణ కదలికలపైనా కన్నేశారు. ఈక్రమంలో సత్యనారాయణ పరారీలో ఉండటంతో గ్రామంలో కూపీ లాగారు. నిందితుడు కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో ఉంటున్నట్టు తెలుసుకున్నారు. హంతకులు అపహరించారని చెబుతున్న మంగమ్మ మెడలోని నానుతాడును టి.నరసాపురం ఆంధ్రా బ్యాంకులో సత్యనారాయణ తాకట్టు పెట్టాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో సత్యనారాయణను నిం దితుడిగా నిర్ధారించుకుని టి.నరసాపురంలో మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య వివాహేతర సం బంధం కారణంగా హత్యచేసినట్టు నిందితుడు అంగీకరించడంతో పోలీ సులు అరెస్ట్ చేశారు.
భర్తే హంతకుడు
Published Thu, Jun 1 2017 3:45 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement
Advertisement