అనుమానంతో భార్య పీక కోసిన భర్త | Husband slits Wifes Throat | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్య పీక కోసిన భర్త

Published Wed, Apr 4 2018 2:07 PM | Last Updated on Wed, Apr 4 2018 3:55 PM

Husband slits Wifes Throat - Sakshi

బాధితురాలు స్వర్ణ

పశ్చిమ గోదావరి జిల్లా : నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య పీక కోసి అనంతరం తాను కూడా అదే బ్లేడుతో భర్త పీక కోసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు..చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకటేశ్వరరావుకు నిడదవోలు మండలం పురుషోత్త పల్లి గ్రామానికి చెందిన స్వర్ణతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇదే క్రమంలో కుటుంబ పోషణ నిమిత్తం స్వర్ణ, కువైట్ వెళ్లి 15 రోజుల క్రితం స్వగ్రామం వచ్చింది.

అప్పటి నుంచి భార్యపై భర్త వెంకటేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. ఆగ్రహంతో వెంకటేశ్వరరావు బ్లేడుతో స్వర్ణ పీకను కోసి తాను కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర రావు పరిస్థితి విషమంగా ఉందని, భార్య స్వర్ణకు  ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement