వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ సుదర్శన్, (వృత్తంలో నిందితులు)
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్) : వివాహే తర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందో ఇల్లాలు. సంచలనం సృష్టించిన ఈ హత్యోందతం డిచ్‌పల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి జీపీ పరిధి గల త్రయంబక్‌పేట్‌లో జరిగింది. డిచ్‌పల్లిలో మంగళవారం నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 4న త్రయంబక్‌పేట్ శివారులో మైలారం మల్లయ్య పంట పొలం వద్ద కట్ట నర్సయ్య(42) మృతదేహం లభించింది. వీఆర్వో ముచ్కురి సాయన్న ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుతో పోలీసులు దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నివేదికలో మృతుడిని గొంతు నులిమి హత్య చేశారని తేలింది. మృతుడి భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. డిచ్‌పల్లికి చెందిన మేకల సాగర్‌తో, మంజులకు 9 నెలల క్రితం ఇందల్వాయి మార్కెట్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్తను అడ్డుతొలగించుకుంటే తమకు స్వేచ్ఛ ఉంటుందని మంజుల ప్రియుడితో కలిసి పథకం వేసింది. మల్లయ్య పంట పొలం వద్దకు రాత్రి పూట కాపలాకు వెళ్తున్నాడు. ఇదే అదునుగా భావించిన మంజుల ఆదివారం రాత్రి ప్రియుడు సాగర్‌కు ఫోన్ చేసి త్రయంబక్‌పేట్‌కు రప్పించింది. అర్ధరాత్రి గుడిసె వద్ద నిద్రిస్తున్న నర్సయ్యను ఇద్దరు కలిసి హత్య చేశారు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారితో తన భర్త ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తుందని నాటకమాడింది. కొందరు గ్రామస్తులతో గుడిసె వద్దకు వెళ్లగా నర్సయ్య మృతి చెంది ఉన్నాడు. ఏమీ తెలియని దానిలా అందరి ఎదుట శవం పై పడి దొంగ ఏడ్పులు ఏడ్చిన మంజు ల అసలు నిందితురాలని తేలడంతో గ్రామస్తులు నివ్వెర పోయారు. హత్య జ రిగిన 24 గంటల్లోనే కేసు ఛేదించి నిం దితులను అరెస్టు చేసిన డిచ్‌పల్లి సీఐ రామాంజనేయులు, ఇందల్వాయి ఎస్‌ఐ రాజశేఖర్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు కిరణ్ గౌడ్, మురళిని ఏసీపీ అభినందించారు. నిందితులు మంజుల, సాగర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలున్నారు. వారు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment