
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఓ అటవీ శాఖ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖలో పనిచేస్తున్న డీఎఫ్‌ఓ వెంకటేశ్వరరావు గెస్ట్ హౌస్‌లో ఓ మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయాడు. కొంత కాలంగా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు ఆయనపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అయినా పై స్థాయి నుంచి స్పందించ లేదు. దీంతో విద్యార్థి నేతలు డీఎఫ్‌ఓపై నిఘా పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సోమవారం అర్థరాత్రి గెస్ట్‌హౌస్‌పై పోలీసులు దాడులు చేసి వెంకటేశ్వరరావుతో పాటు ఆయనతో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.
డీఎఫ్ఓ రాసలీలల వ్యవహారంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా డిఎఫ్ఓ వేంకటేశ్వర రావును సస్పెండ్ చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment