చిన్న కోడలితో సంబంధం.. అత్త, పెద్ద కోడలు కలిసి.. | Man Killed By Wife And Daughter In Law For Affair In UP | Sakshi
Sakshi News home page

మామ సంబంధం.. గొంతుకోసి చంపిన భార్య, పెద్దకోడలు

Published Sun, Dec 13 2020 8:14 PM | Last Updated on Tue, Dec 15 2020 9:43 AM

Man Killed By Wife And Daughter In Law For Affair In UP - Sakshi

లక్నో: చిన్న కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను పెద్ద కోడలితో కలిసి దారుణంగా హత్య చేసిందో భార్య. కోడలితో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని గొంతుకోసి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లా శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోయిరానా గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి నలుగు కుమారులు. వీరిలో ఇద్దరికి కొన్నేళ్ల కింద వివాహం జరిగింది. వీరంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ ముంబైలో కూలీ పనులు చేస్తున్నారు. కాగా,ఇటీవల పెళ్లి అయిన ఇద్దరు కుమారులు భార్యలతో కలిసి అత్తవారింట్లో ఉంటున్నారు.

మామ తరచూ ఇద్దరు కుమారుల దగ్గరికి వెళ్లెచ్చేవాడు. ఈ క్రమంలో చిన్న కోడలితో మామకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భార్య, పెద్ద కోడలు.. ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో కోపం పెంచుకున్న మామ.. పెద్ద కోడలు, భార్యపై దాడి చేశాడు. కొద్ది రోజులుగా పెద్ద కోడలు మరో ఇంట్లో కిరాయికి ఉంటున్నారు.

కాగా, ఐదు రోజుల కిందట చిన్న కోడలిని పుట్టింటి నుంచి తన ఇంటికి రప్పించుకున్నాడు మామ. శనివారం రాత్రి ఆమెతో కలిసి ఉండగా ఆ ఇంటికి వచ్చిన భార్య, పెద్ద కోడలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకిని చాకుతో గొంతు కోసి హత్య చేశారు. భయంతో బయటకు పరుగులు తీసిన చిన్న కోడలు, ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. సదరు వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు చెప్పారు. చిన్న కోడలి ఫిర్యాదు మేరకు.. అత్త, తోటి కోడలుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement