మృతుడి బంధువులతో మాట్లాడుతున్న సీఐ
సాక్షి, నకిరేకల్: మండల పరిధిలోని చిత్తలూరు గ్రామానికి చెందిన గెండెబోయిన మల్లేష్(29)కి సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని జాజిరెడ్డిగూడేనికి చెందిన చీమల లింగయ్య కుమార్తె మమతతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం మల్లేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేష్ తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పంటలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అడ్డు తొలగించుకోవాలని..
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని మమత నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన ప్రియుడు సోమయ్యకు చెప్పింది. మల్లేష్ మద్యం మత్తులో ఉండగా తమ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్టుగానే మంగళవారం అర్వపల్లి సంతకు పోయిన మల్లేష్ పూటుగా మద్యం సేవించి తిరిగి వచ్చే క్రమంలో జాజిరెడ్డిగూడెంలోని అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు.
తలదిండుతో అదిమి..
ఊపిరాడకుండా చేసి..
ఇదే అదునుగా భావించిన భార్య మమత భర్త మద్యం మత్తులో ఉన్నాడనే విషయాన్ని ప్రియుడు సోమయ్యకు చేరవేసింది. మల్లేష్ టీవీ పెట్టుకొని చూస్తూ ఇంటి హాలులోని బెడ్‌పై నిద్రించే క్రమంలో వాంతులు చేసుకుంటూ బెడ్‌పైనుంచి జారి కిందపడ్డాడు. గమనించిన అతని భార్య మల్లేష్‌ను శభ్రపరచి నేలపైనే పడుకోబెట్టింది. రాత్రి 11.30 గంటల సమయంలోనే మల్లేష్ ఇంటికి వచ్చిన సోమయ్య ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు బయటకు రాకుండా బెడ్‌రూం గడియపెట్టి నడుస్తున్న టీవీ సౌండ్ పెంచారు.
మద్యం మత్తులో స్పృహతప్పి ఉన్న మల్లేష్ ముఖంపై తలదిండుతో సోమయ్య బలంగా అదిమిపట్టగా, మమత మల్లేష్ కదలకుండా గట్టిగా కాళ్లు పట్టుకుంది. దీంతో కొద్దిసేపట్లోనే మల్లేష్ మృతిచెందాడు. మల్లేష్ ప్రాణం పోయిన విషయాన్ని నాడి ద్వారా గుర్తిం చిన మమత ఆ పురుగుల మందును మల్లేష్ నోట్లో పోయగా, సోమయ్య శరీరంపై పోశాడు. అనంతరం గుట్టుచప్పుడుకాకుండా సోమయ్య మల్లేష్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు.
ఆత్మహత్య చేసుకున్నాడని..
భర్త మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకున్న మమత తెల్లవార్లు్ల నిద్రపోలేదు. బుధవారం తెల్లవారుజా మున ఏమీ తెయనట్లు మల్లేష్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటూ విషయాన్ని సమీపంలో ఉన్న అత్తమామ, బావ కుటిం బీకులకు తెలిపింది. లబోదిబోమంటూ మల్లేష్ తల్లిదండ్రులు, సోదరుడు వచ్చి చూసేసరికి శరీ రంపై పురుగులమందు పోసి ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. మల్లేష్ మృతి చెందిన విషయం గ్రామంలో దావనంలా వ్యాపిం చడంతో గ్రామస్తులు తండోపతండలుగా తరలివచ్చారు.
ఆత్మహత్య కాదని, హత్యేనంటూ నిర్ధారణకు వచ్చిన మల్లేష్ కుటుంబీకులు, సమీపబంధువులు, గ్రామస్తులు మమతపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. మల్లేష్ హత్య విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ రాజు సిబ్బందితో చిత్తలూరుకు చేరుకుని ఏలాంటి దాడులు, ఘర్షణలు జరుగకుండా నియంత్రించారు. సంఘటనా స్థలాన్ని సీఐ క్యాస్ట్రోరెడ్డి పరిశీలించారు. మృతుడి భార్య మమతను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను రహస్య ప్రదేశానికి తరలించి విచారించడంతో నేరం అంగీకరించినట్టు తెలిసింది.
అందరూ చూస్తుండగానే..
తన సన్నిహితుడైన గుండెబోయిన మల్లేష్‌ను హత్య చేసిన పూల సోమ య్య అలియాస్ సోమన్న మంగళవా రం రాత్రి ఇంట్లోను ఉండి బుధవారం ఉదయం సుమారు 6.00 గంటల సమయంలో భార్య, పిల్లలతో కలిసి ఊరువిడిచి తుడిమిడి రోడ్డుమీదుగా ద్విచక్రవాహనంపై పరారయ్యా డు. గ్రామంలో ప్రధాన రాజకీయపార్టీ నాయకుడుగా ఉన్న సోమయ్యకు నకిరేకల్‌కు చెందిన ఓ మాజీ ఎంపీపీ సమీప బంధువు. ఊరువిడిచి పరారైన సోమయ్య ఎక్కడ తలదాచుకున్నాడో గుర్తించే క్రమంలో పోలీసులు ఉన్నారు. పూల సోమయ్య స్వగ్రామం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి . రెండు దశాబ్దాల క్రితం సోమయ్య తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చిత్తలూరుకు వలసవచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment