
సాక్షి, సిరిసిల్ల : వైద్యుల నిర్లక్ష్యంతో జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందారు. ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయడంతోనే ఈ అనర్థం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు మహిళలు మృతి చెందారని బంధువుల ఆరోపించడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment