Government Medical College Hospital
-
వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతంలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరుస్తోంది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచి్చతంగా గ్యాంగ్ రేపేనని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు. ఒళ్లంతా గాయాలే నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో విస్మయకర వివరాలున్నాయి. ‘‘రేప్ చేశాక గొంతు నులిమి చంపారు. పెనుగులాట సందర్భంగా కదలకుండా తలను గోడకు బలంగా అదమడంతో వెనక వైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీసుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్డిలేజ్ చితికిపోయింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగికదాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలున్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమిపట్టి మూసేసినట్లు చర్మం కమిలింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం వద్ద ‘పెలి్వక్ గార్డిల్’ చీలిపోయింది. అంటే కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు’ అని వైద్యురాలి బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు. మూడు గంటలు బయటే నిలబెట్టారు మృతదేహాన్ని చూపించకుండా ఆస్పత్రి బయట మూడు గంటలు బయటే నిలబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘‘తర్వాత తండ్రిని అనుమతించారు. తన ఒంటిపై బట్టల్లేవు. కాళ్లు పక్కకు విరిచేసినట్లు ఫొటోలోకనిపిస్తోంది. కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుండా చేసి చంపేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. -
చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా వచ్చాడు
టీనగర్: మృతిచెందినట్లు ఖననం చేయబడిన వ్యక్తి రాత్రి సజీవంగా ప్రత్యక్షం కావడంతో సంచలనం ఏర్పడింది. విల్లుపురం జిల్లా, ఉలుందూరుపేట, పట్టణ పంచాయితీ, ఈశ్వరన్ కోవిల్ వీధి, సముద్రకుళం ప్రాంతానికి చెందిన కలియన్ (70) కూలి కార్మికుడు. ఇతనికి షణ్ముగం, మురుగన్, కాత్తవరాయన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఇంట్లో కుమారులతో గొడవ పడి కలియన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కలియన్ కోసం కుమారులు గాలిస్తూ వచ్చారు. దీనిగురించి ఉలుందూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశా రు. గత ఏడాది 2014 ఆగస్టు 28వ తేదీన విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు ఉలుందూరుపేట పోలీసుస్టేషన్ కు సమాచారం అందింది. ఉలుందూరుపేట పోలీసులు కలియన్ కుమారులను పిలిపించి అక్కడున్న మృతదేహాన్ని చూపించారు. అక్కడ అతన్ని తండ్రిగా భావించిన కుమారులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపించి పాతిపెట్టారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో మృతిచెందినట్లు భావిం చబడిన కలియన్ ఉలుందూరుపేటలోగల తన ఇంటికి చేరుకున్నాడు. ఇతన్ని గమనించిన ఇరుగుపొరుగువారు భయంతో పరుగులు తీశారు. తర్వాత దగ్గరకు వచ్చి చూసి అతన్ని కలియన్గా గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. మూడేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కలియన్ ఒక ఆశ్రమంలో గడిపినటు తెలి పాడు. దీంతో ఖననం చేయబడిన వ్యక్తి ఎవరు? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
జూడాల సమ్మె
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం కలకలం సృష్టించింది. అకస్మాత్తుగా వారు ఆందోళనకు పూ నుకోవడంతో అధికారులు కంగు తిన్నారు. ఈ అంశంపై డీఎంఈ తీవ్రంగా స్పందించి 46 మంది జూడాలను డెరైక్టరేట్‌కు సరెండర్ చేయించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ వరకు జూడాలు ర్యాలీగా వెళ్లి వైస్ ప్రిన్సిపాల్ రమాదేవికి సమ్మె నో టీసు అందించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి పారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించడంలో పభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని నిరసన వ్యకం చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. సమ్మె విషయం తెలుసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో సమ్మె చేయడం ఏమిటని వైద్యాధికారులను ప్రశ్నించారు. ‘సమ్మెలో ఎంత మంది పాల్గొన్నారు, సమ్మె నోటీసులో ఎంత మంది సంతకాలు చేశారు’ తదితర వివరాలతో తగిన నివేదిక పంపాలని, జూడాలను వెంటనే డెరైక్టరేట్‌కు సరెండర్ చేయాలని ఆదేశించారు. డీఎంఈ ఆదేశాలతో కళాశాల అధికారులు స్పందించి ఆగమేఘాలపై నివేదిక తయారు చేశారు. 46 మంది జూనియర్ డాక్టర్లు సంతకాలు చేసి, సమ్మెలో పాల్గొన్నారని తెలుపుతూ వారిని సరెండర్ చేస్తూ నివేదిక పంపించారు. ఈ విషయాన్ని వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి ధ్రువీకరించారు. కొంత కాలంగా గైర్హాజరు 109 మంది జూనియర్ డాక్టర్లు పీజీ విద్య కోసం అక్టోబర్‌లో మెడికల్ కళాశాలకు వచ్చారు. వీరిని పది విభాగాలకు కేటాయించారు. వైద్య సేవలు అందించాల్సింది పోయి వీరు నెల రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నారు. కొంతమంది స్థానికంగా, మరికొందరు వైద్యులు హైదరాబాద్‌లోని ప్రయీవేటు ఆస్పత్రులలో పని చేస్తున్నారు. ఈ విషయంలో ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన అధికారులు జూనియర్ డాక్టర్ల హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు రావాలని గట్టిగా హెచ్చరించారు. దీంతో వారు విధులకు రావడం మొదలుపెట్టారు. వారం రోజుల క్రితం, కళాశాలలో సౌకర్యాలు లేవని, సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు అందించారు. అనంతరం అందుబాటులో లేకుండాపోయారు. తిరిగి గురువారం హైదరాబాద్‌లోని జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా సమ్మె నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. మరోవైపు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగడం పరిస్థితిని ఎటు తీసుకెళ్తేందో వేచి చూడాలి.