
ఖిల్లాను సందర్శించిన ఐఆర్‌ఎస్ బృందం
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లాను శనివారం ట్రైనీ ఐఆర్‌ఎస్ బృందం సందర్శించింది. 35 మంది సభ్యులతో కూడిన బృందం నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఆర్కెటిక్స్ విభాగం మర్రిచెన్నారెడ్డి భవనం హైదరాబాద్ నుంచి భువనగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బృందంలోని పలువురు రాక్‌క్లైంబింగ్ చేశారు.