విహార యాత్రలో విషాదం
జీపు బోల్తాపడి ఒకరి మృతి
కూనవరం : విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు బయలుదేరగా, మార్గంమధ్యలో ఒకరిని మృత్యువు కబళించింది. స్థానిక పొట్లవాయిగూడెం సమీపంలో కల్వర్టు వద్ద మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టె¯Œæ్త బ్యాచ్‌కు చెందిన మొత్తం 9 మంది స్నేహితులు కలిసి మంగళవారం ఉదయం భద్రాచలంలో రామాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి పాపికొండలు పర్యాటక ప్రదేశాలను తిలకించి, తిరుగుపయనమయ్యారు. వీరి వాహనం పొట్లవాయిగూడెం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఆజ్మీర శివశర్మ(24) అక్కడికక్కడే మరణించగా, జాదవ్ చైతన్యకు చేయి విరిగింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. ఉట్నూరుకు చెందిన జాదవ్ చైతన్య గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. మృతుడు శివశర్మ ఎస్సై సెలెక్ష¯Œæలో ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణుడైనట్టు తెలిసింది. స్నేహితుల్లో ఏడుగురిది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామానికి చెందినవారు కాగా, ఒకరు టేకులపల్లి, మరొకరు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందినవారు. వీరు హైదరాబాద్‌లో ఉన్నత విద్యను చదువుతున్నారు. టేకులపల్లిలో స్నేహితుడి చెల్లెలు శుభకార్యం కోసం వీరు వచ్చారు. సీఐ వీరయ్యగౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై రాజేష్‌కుమర్ దర్యాప్తు చేస్తున్నారు.