కోల్‌కతా: ఆర్‌జీ కర్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 33 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న వైద్యులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం సచివాలయం(నబన్న)లో ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే..
చివరి నిమిషంలో(5.23ని. టైంలో) ఆ భేటీని లైవ్ టెలికాస్ట్ చేయించాలని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రతినిధులు హాజరుకావాలని నిరసన చేపట్టిన వైద్యులు ప్రధాన షరతుగా పెట్టారు. ఈ చర్చలను బహిరంగ వేదికగా జరపాలని మరో కండీషన్‌గా పెట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ చర్చలకు హాజరుకావాలని.. వీటిని లైవ్‌లో ప్రసారం చేయాలని కోరారు. చర్చల్లో పారదర్శకత కోసమే తాము ఇలా కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
వైద్యులలో 12 నుంచి 15 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ సమావేశానికి రావాలంటూ సీఎస్ మనోజ్ పంత్ పేరిట ఆహ్వానం వెళ్లింది. అయితే 30 మంది బృందం చర్చలకు వెళ్తామని వైద్యులు అంటున్నారు. ఈ డిమాండ్లతో సాయంత్రం 6గం. లకేప్రారంభం కావాల్సిన చర్చలపై సందిగ్ధం నెలకొంది.
అంతకంటే ముందే.. సీఎం మమతా బెనర్జీతో చర్చలకు తామూ సిద్ధమంటూ వైద్యులు ప్రకటన చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న అభయ ఘటన ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలు ఉండాలని, అందుకోసం అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎంవోకు మెయిల్ పంపారు. దీంతో.. వెంటనే ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయానికి రావాల్సిందిగా ప్రభుత్వం బదులిచ్చింది.
ఇదీ చదవండి: అభయ ఘటన. నిందితుడి గురించి షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment