కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు కూడా నిలిపివేశారు. మరోవైపు.. 42 మంది డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం బదిలీపై చేయటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిస్పందిస్తూ బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా మెడికల్ కాలేజీ, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆమె ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా నిరసలను తెలపడానికి ఈ రెండు మెడికల్ కాలేజీలు కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే వాటిని సీఎం మమత టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు మెడికల్ కాలేజీల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లు బదిలీ చేయబడ్డారు.
ఇది సీనియర్ డాక్టర్ల సంఘాన్ని భయపెట్టేలనే ప్రయత్నం. మమతా బెనర్జీ ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు?. ఆగస్టు 16న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8 పేజీల బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇది ఇప్పటికే గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది’’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఇక.. బదిలీ చేయబడిన 42 మంది డాక్టర్లలో ఇద్దరు డాక్టర్ల సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ గతంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment