Amit Malviya
-
కోల్కతా డాక్టర్ కేసు: 42 డాక్టర్లపై బదిలీపై బీజేపీ ఫైర్
కోల్కతా: కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు కూడా నిలిపివేశారు. మరోవైపు.. 42 మంది డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం బదిలీపై చేయటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిస్పందిస్తూ బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ కోల్కతా మెడికల్ కాలేజీ, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆమె ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా నిరసలను తెలపడానికి ఈ రెండు మెడికల్ కాలేజీలు కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే వాటిని సీఎం మమత టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు మెడికల్ కాలేజీల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లు బదిలీ చేయబడ్డారు. ఇది సీనియర్ డాక్టర్ల సంఘాన్ని భయపెట్టేలనే ప్రయత్నం. మమతా బెనర్జీ ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు?. ఆగస్టు 16న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8 పేజీల బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇది ఇప్పటికే గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది’’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఇక.. బదిలీ చేయబడిన 42 మంది డాక్టర్లలో ఇద్దరు డాక్టర్ల సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ గతంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో పని చేశారు. -
రాజ్కోట్ ఎయిర్పోర్టు ఘటన, ‘నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’: బీజేపీ
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా అటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్, ఇటు గుజరాత్లోని రాజ్ కోట్ మినాశ్రయంలోని టెర్మినల్ రూఫ్ కూలిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. రాజ్ కోట్ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.అయితే వరుస ఘటనలను ఉద్దేశిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ ఎయిర్పోర్టును గతేడాదే మోదీ ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని దుయ్యబట్టింది. దీనికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఘటనకు నెహ్రూను నిందించొద్దని, ఎందుకంటే ఆయన విమానాశ్రయాలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేసింది.దీనికి బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి దీటుగా బదులిచ్చారు. ‘‘భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్కోట్ ఎయిర్పోర్టులోని క్లాత్ టెంట్ చిరిగిపోయింది. అంతేగానీ.. కట్టడం కూలినట్లు కాదు. ఇక, ఈ ఘటనకు మనం నెహ్రూ (మాజీ ప్రధాని)ను నిందించొద్దు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదు.ఆయన హయాంలో మనమంతా డీఆర్డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించాం’’ అని అన్నారు. ఇక, దిల్లీ ఘటన నేపథ్యంలో దేశంలోని అన్ని చిన్నా పెద్ద విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించాలని పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. -
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనటె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్లోని ఫైవ్ స్టార్ హోటెల్స్తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని.. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్కు చెందిన శంతను సిన్హా తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె తెలిపారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రీయా శ్రీనటె డిమాండ్ చేశారు. सवाल यह है कि- BJP की IT सेल है या दरिंदों का जमावड़ामहिलाओं के खिलाफ होने वाले अपराध में हर बार आरोपी BJP का नेता ही क्यों होता है?• BJP के पदाधिकारी पर गंभीर आरोप लगे हैं, लेकिन पूरी BJP चुप है।• ऐसे आरोपों पर खामोशी का सच क्या है, आखिर इस पदाधिकारी को क्यों और किसके… pic.twitter.com/rzwDsOPBjp— Congress (@INCIndia) June 10, 2024 ‘మేం బీజేపీని మహిళలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియాపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే మాల్వియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నానమి అన్నారు.కాగా, ఈ ఆరోపణల్ని అమిత్ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పరువునష్టం దావా వేస్తున్నట్లు సూచించారు.