న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా అటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్, ఇటు గుజరాత్‌లోని రాజ్ కోట్ మినాశ్రయంలోని టెర్మినల్ రూఫ్ కూలిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. రాజ్ కోట్ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
అయితే వరుస ఘటనలను ఉద్దేశిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ ఎయిర్‌పోర్టును గతేడాదే మోదీ ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని దుయ్యబట్టింది. దీనికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఘటనకు నెహ్రూను నిందించొద్దని, ఎందుకంటే ఆయన విమానాశ్రయాలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేసింది.
దీనికి బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి దీటుగా బదులిచ్చారు. ‘‘భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులోని క్లాత్ టెంట్ చిరిగిపోయింది. అంతేగానీ.. కట్టడం కూలినట్లు కాదు. ఇక, ఈ ఘటనకు మనం నెహ్రూ (మాజీ ప్రధాని)ను నిందించొద్దు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదు.
ఆయన హయాంలో మనమంతా డీఆర్‌డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించాం’’ అని అన్నారు. ఇక, దిల్లీ ఘటన నేపథ్యంలో దేశంలోని అన్ని చిన్నా పెద్ద విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించాలని పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment