బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు | Amit Malviya Faces This Allegations From Rss Member: Congress Seeks His Removal | Sakshi
Sakshi News home page

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు

Published Mon, Jun 10 2024 3:32 PM | Last Updated on Mon, Jun 10 2024 4:33 PM

Amit Malviya Faces This Allegations From Rss Member: Congress Seeks His Removal

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వియాపై కాంగ్రెస్‌ నేత సుప్రీయా శ్రీన‌టె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. 

ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని ఫైవ్‌ స్టార్‌ హోటెల్స్‌తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని.. ఇదే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన శంతను సిన్హా తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె తెలిపారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రీయా శ్రీనటె డిమాండ్‌ చేశారు. 

 

‘మేం బీజేపీని మహిళలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ మాల్వియాపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే మాల్వియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నానమి అన్నారు.

కాగా, ఈ ఆరోపణల్ని అమిత్‌ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పరువునష్టం దావా వేస్తున్నట్లు సూచించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement