IT cell
-
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనటె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని ఫైవ్ స్టార్ హోటెల్స్తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని.. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్కు చెందిన శంతను సిన్హా తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె తెలిపారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రీయా శ్రీనటె డిమాండ్ చేశారు. सवाल यह है कि- BJP की IT सेल है या दरिंदों का जमावड़ामहिलाओं के खिलाफ होने वाले अपराध में हर बार आरोपी BJP का नेता ही क्यों होता है?• BJP के पदाधिकारी पर गंभीर आरोप लगे हैं, लेकिन पूरी BJP चुप है।• ऐसे आरोपों पर खामोशी का सच क्या है, आखिर इस पदाधिकारी को क्यों और किसके… pic.twitter.com/rzwDsOPBjp— Congress (@INCIndia) June 10, 2024 ‘మేం బీజేపీని మహిళలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియాపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే మాల్వియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నానమి అన్నారు.కాగా, ఈ ఆరోపణల్ని అమిత్ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పరువునష్టం దావా వేస్తున్నట్లు సూచించారు. -
హీరో సిద్దార్థ్‌కు బెదిరింపులు.. ఖండించిన బీజేపీ
తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వస్తున్నాయని హీరో సిద్దార్థ్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేగాక అత్యాచారం బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పాడు. అయితే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ ఫోన్ నంబర్ లీక్ చేయడం వల్లే ఇలా జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఇవాళ సిద్దార్థ్ మరో ట్వీట్ చేస్తూ తనకు, తన కుటుంబం భద్రత దృష్ట్యా పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ స్పోక్స్‌పర్సన్ నారాయణన్ తిరుపతి కూడా దీనిపై స్పందించారు. సిద్దార్థ్ ప్రధాని మోదీని అగౌరపరిచి మరోసారి నేరస్థుడయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సిద్ధార్థ్ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. గతంలో నేను అతడిపై కేసు పెట్టాను. అది ఇప్పటికీ కోర్టులోనే ఉంది. తాజాగా అతడు ప్రధాన మంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి మరోసారి అపరాది అయ్యాడు. ఇటీవల సిద్దార్థ్ చేసిన ట్వీట్లో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుతం తనకు వస్తున్న బెదిరింపుల్లో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు. ఒకవేళ అతనికి సమస్య ఉంటే చట్టపరమైన చర్య తీసుకోవాలి. కానీ, ప్రధానమంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకత తీసుకురావడం సరైనది కాదు. ఇది ఖండించదగిన చర్య’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ వింగ్ హెడ్ సీటీఆర్ నిర్మల్ కుమార్ సిద్దార్థ్ ఆరోపణలను ఖండించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సిద్దార్థ్‌కు వస్తున్న బెదిరింపులకు బీజేపీకి ఎలాంటి సబంధం లేదు. సిద్దార్థ్ వంటి వ్యక్తులపై దృష్టి పెట్టొద్దని పార్టీ సభ్యులు, అనుచరులను అభ్యర్థిస్తున్న’ అని పేర్కొన్నారు. కాగా తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ తన మొబైల్ నంబర్ లీక్ చేసిందని, గడిచిన 24 గంటల్లో తనకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చినట్లు సిద్దార్థ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని, ఆ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను.. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే అని తెలిపాడు. అంతేగాక వీట్నింటిని పోలీసులుకు అందించానని కూడా సిద్దార్థ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. During this pandemic all of us very much focused on supporting people in providing food, medicine..etc Requesting all supporters not to give any attention to individuals like @Actor_Siddharth who are just trying to pass time, pls stay focused on covid support to people. pic.twitter.com/1d9Eirnqx3 — CTR.Nirmal kumar (@CTR_Nirmalkumar) April 29, 2021 చదవండి: నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్ పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ మొబైల్ నంబర్ లీక్ చేసిందని ఆరోపించారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ నా మొబైల్ నంబర్ లీక్ చేసింది. గడిచిన 24 గంటల్లో నాకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయి. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని.. మాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. వీట్నింటిని పోలీసులుకు అందించాను. నేను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు’’ అని తెలిపారు. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 దీంతో పాటు సిద్ధార్థ్ తనను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీశారు. వాటిని తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ నాయకులు నిన్న నా పర్సనల్ నంబర్ని లీక్ చేశారు. చాలా గ్రూపుల్లో నా నంబర్ చక్కర్లు కొట్టింది. వీరంతా నన్ను ట్రోల్ చేశారు. నేను కోవిడ్‌తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా’’ అని వాపోయారు సిద్ధార్థ్. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 ఇక సిద్ధార్థ ట్వీట్‌పై నటి శ్రేయా ధన్వంతరీ స్పందించారు. ఇది చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో సిద్ధార్థ్ ముందు ఉంటారు. కొద్ది రోజుల క్రితం తన సోసల్ మీడియాలో కోవిడ్‌ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. చదవండి: పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
దివ్య స్పందన స్థానంలో మరో వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను కొత్త వ్యక్తికి అప్పగించింది. గుజరాత్‌కు చెందిన రోహన్ గుప్తాను సోషల్ మీడియా విభాగానికి చీఫ్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాగా మొన్నటి వరకు సోషల్ మీడియా వింగ్‌ను నడిపిని ఆ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నాలుగు నెలల అనంతరం ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. రోహన్ గుప్తా 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా పనిచేశారు. ఏఐసీసీ జాతీయ మీడియా సమన్వయకర్తగా ఉన్న కాంగ్రెస్ నేత రాజ్‌కుమార్ గుప్తా కుమారుడే రోహన్ గుప్తా. -
కాంగ్రెస్‌కు షాక్: భారీగా ఫేస్బుక్ పేజీల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల నకిలీ అకౌంట్లు, పేజీలను భారీ స్థాయిలో తొలగించినట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పోమవారం వెల్లడించింది. యూజర్లను తమ పోస్టులతో తప్పుదోవ పట్టిస్తున్నందు వల్లే ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. అలాగే తొలగించిన కొన్ని నమూనా పేజీలను కూడా పోస్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్లో పనిచేసే వారి వ్యక్తిగత అకౌంట్లతో సంబంధం ఉన్న ఎఫ్బీ పేజీలను తొలగించినట్లు ఎఫ్బీ సైబర్ సెక్యూర్టీ హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు. వీటిని ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా గుర్తించినట్టు చెప్పారు. వ్యక్తులు వారి గుర్తింపును దాచి పెట్టడానికి ప్రయత్నించినా, కాంగ్రెస్ ఐటీ సెల్‌తో ఉన్న అనుబంధం ద్వారా గుర్తించామన్నారు. ఆయా అకౌంట్ల ప్రవర్తన ఆధారంగా తొలగిస్తున్నామనీ, అయితే ఈ తొలగింపులు వారు పోస్ట్ చేసిన కంటెంట్‌కు సంబంధించి కాదని తెలిపింది. అయితే తమ ప్లాట్‌ఫాంను అనుచిత పద్ధతుల్లో వాడడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది. పాకిస్థాన్ నుంచి ఫేక్ అకౌంట్లను ఆపరేట్ చేస్తున్నందున మరో 103 ఖాతాలను తొలగిస్తున్నట్లు కూడా ఫేస్బుక్ వెల్లడించింది. మిలిటరీ ఫ్యాన్ పేజీలు, పాక్ సంబంధిత వార్తల పేజీలు, కశ్మీర్ సంబంధిత పేజీలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ఉద్యోగులు ఈ నకిలీ అకౌంట్లను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎఫ్బీ పేర్కొంది. -
ఆ కేసులో కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ సభ్యుడిని మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఐటీ సెల్లో పనిచేసే చిరాగ్ పట్నాయక్ తనను లైంగికంగా వేధించాడని గతంలో ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్నాయక్‌ను నార్త్ ఎవెన్యూ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. బాధితురాలు మేజిస్ర్టేట్ ఎదుట తన స్టేట్మెంట్ను రికార్డు చేసిన క్రమంలో నిందితుడిని అదుపుతోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పట్నాయక్ సోషల్ మీడియా మేనేజర్‌గా ఉన్న సమయంలో బాధితురాలు కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. నిందితుడు పలు సందర్భాల్లో తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడని, తన వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకువచ్చేలా ప్రవర్తించాడని ఢిల్లీ పోలీస్ కమీషనర్ అమ్యూ పట్నాయక్, ఇతర సీనియర్ అధికారులకు ఈమెయిల్లో ఫిర్యాదు చేశారు. కాగా పట్నాయక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా హెడ్ దివ్య స్పందన విస్మయం వ్యక్తం చేశారు. పట్నాయక్‌ను సమర్ధిస్తూ 39 మంది పార్టీ కార్యకర్తల సంతకాలతో కూడిన స్టేట్మెంట్ను ఆమె తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతోనే తాను టీమ్ నుంచి వైదొలగుతున్నట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారని చెప్పారు. -
గిరిజన సంక్షేమంలో ‘ఐటీ సెల్’
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ సమాచార సాంకేతిక కేంద్రం(ఐటీ సెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసెస్ (టీఎస్టీఎస్)తో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన సంక్షేమ శాఖ కార్యక్రమాల పనితీరును ఐటీ సెల్ విశ్లేషించనుంది. ఈ సెల్లో ప్రత్యేకంగా నలుగురు టెక్నీషియన్లను నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 472 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో 1.22 లక్షల మంది, 99 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 65 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వసతిగృహాలతోపాటు సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యతను ఐటీసెల్‌కు అప్పగించనుంది. ఈ మేరకు రాష్ట్రం లోని అన్ని వసతిగృహాల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును అంచనా వేస్తారు. బోధన, భోజన, విద్యార్థుల ఆరోగ్యస్థితి వంటి సమాచారాన్ని వెబ్సైట్లో అప్డేట్ చేసి నివేదికలు రూపొం దిస్తారు. ఈ ప్రక్రియతో ప్రతి హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఐటీ సెల్‌కు కచ్చితమైన సమాచారం వస్తుందని, వాటి ఆధారంగా కార్యాచరణ చేపట్టేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమాయత్తం చేస్తారు. -
బాలీవుడ్ ప్రముఖుల కాల్ రికార్డులు దోచేసి..
పేరున్న వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ కాల్ రికార్డులను సేకరిస్తూ పోలీస్ ఐటీ సెల్ విభాగం కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని గుడ్ గావ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. సెలబ్రిటీల కాల్ డేటాలను అందిస్తే ఉద్యోగం చూపుతానన్న వ్యక్తికి ప్రదీప్ కుమార్(30) సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆ వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ పేరును దీప్ బురాగా ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇరువురి మధ్య దాదాపు 15 మంది సెలబ్రిటీల కాల్ డేటాలు చేతులు మారినట్లు వివరించారు. ఫోన్ నంబర్లు ఏ సెలబ్రిటీకి చెందినవో కూడా కుమార్ కు తెలియదని, కేవలం ముంబైకు చెందిన వ్యక్తి డేటాను అందించి అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటుంటాడని ఎస్సై సజ్జన్ కుమార్ చెప్పారు. కుమార్ నుంచి ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్, ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిలాస్ పూర్ లోని క్రైమ్ యూనిట్ 6 నుంచి అధికారిక ఈ మెయిల్ ఐడీ ద్వారా కాల్ రికార్డులు కావాలంటూ పంపడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.