సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ సమాచార సాంకేతిక కేంద్రం(ఐటీ సెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)తో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన సంక్షేమ శాఖ కార్యక్రమాల పనితీరును ఐటీ సెల్ విశ్లేషించనుంది. ఈ సెల్‌లో ప్రత్యేకంగా నలుగురు టెక్నీషియన్లను నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 472 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో 1.22 లక్షల మంది, 99 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 65 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
వసతిగృహాలతోపాటు సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యతను ఐటీసెల్‌కు అప్పగించనుంది. ఈ మేరకు రాష్ట్రం లోని అన్ని వసతిగృహాల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును అంచనా వేస్తారు. బోధన, భోజన, విద్యార్థుల ఆరోగ్యస్థితి వంటి సమాచారాన్ని వెబ్‌సైట్లో అప్‌డేట్ చేసి నివేదికలు రూపొం దిస్తారు. ఈ ప్రక్రియతో ప్రతి హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఐటీ సెల్‌కు కచ్చితమైన సమాచారం వస్తుందని, వాటి ఆధారంగా కార్యాచరణ చేపట్టేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమాయత్తం చేస్తారు.
గిరిజన సంక్షేమంలో ‘ఐటీ సెల్’
Published Tue, Dec 13 2016 3:16 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
Advertisement
Advertisement